Nandamuri Balakrishna: బాధలో ఉన్న బాలయ్యను సెల్ఫీ అడిగిన అభిమాని.. ఆయన చేసిన పనికి అందరూ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nandamuri Balakrishna: సెలబ్రిటీకనిపించగానేసెల్ఫీ అడగడం ప్రతి అభిమాని చేసే పనే.. అభిమానులు సెల్ఫీ అడగగానే తారలు కూడా ఎంతో సంతోషంతో ఇస్తూ ఉంటారు. అయితే సమయం, సందర్భం కూడా చూసుకోవాలి కదా.. సెలబ్రిటీస్ పబ్లిక్ ప్రాపర్టీనే .. కానీ వారికి కూడా మనసు ఉంటుంది.. బాధలు ఉంటాయని కొంతమంది అభిమానులు అర్ధం చేసుకోవాలి. తారలు కనిపించడం ఆలస్యం వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అనేది కూడా పట్టించుకోకుండా సెల్ఫీలు అడుగుతూ వారిని ఇబ్బంది పెడుతుంటారు కొంతమంది అభిమానులు. తాజాగా ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొన్నారు నందమూరి బాలకృష్ణ. మొదటి నుంచి బాలయ్య అభిమానులతో రూడ్ గా ఉంటారు అనేది అందరికీ తెల్సిన విషయమే.
తనకు నచ్చకుండా ఫోటోలు తీస్తే అభిమాని ఫోన్ పగలడమో, చెంప పగలడమో జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం బాలయ్య చేసిన పనికి ప్రతి ఒక్కరు షాక్ అయ్యారు. బాలయ్య చెల్లి ఉమామహేశ్వరి మృతి చెందిన విషయం విదితమే.. నేడు ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అనంతరం పుట్టెడు దుఃఖంతో ఉన్న బాలయ్యను ఒక అభిమాని సెల్ఫీ కావాలని అడిగాడు. ఎదుటివాళ్ళ బాధను పట్టించుకోకుండా,వారి పరిస్థితిని అర్ధం చేసుకోకుండా సెల్ఫీల కోసం ఎగబడే వారిని చూసి బాలయ్య ఏం అనాలో తెలియక ఒక నిమిషం అతడిని ఏహ్య భావంతో చూసి మౌనంగా వెళ్లిపోయారు. ఇంతకంటే ఘోరమైన అవమానం ఇంకేదీ ఉండదేమో సదురు అభిమానికి అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Also Read
- Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
- Tollywood vs Kollywood: తెలుగు గడ్డపై తమిళ హీరోల జోరు.. మరి కోలీవుడ్‌లో తెలుగు సినిమాల పరిస్థితి దారుణమా?
- Pournami Song: డార్లింగ్ ప్రభాస్ ‘పౌర్ణమి’ పాటకు గ్లోబల్ క్రేజ్.. చైనీస్ డ్యాన్సర్ కూచిపూడి పెర్ఫార్మెన్స్ వైరల్!
- Vaishnavi: మా ఎపిక్ బోల్డ్ కంటెంటే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు!
తాజావార్తలు
-
Pan India Star: పాన్ ఇండియా కూడా పాతదైపోయిందా? హీరోలకు నెక్ట్స్ ట్యాగ్ ఏంటి?
-
Minister Satya Kumar: కొత్త పార్టీ పెట్టుకో.. కానీ ముందు ప్రజలకు ఆ లెక్క చెప్పు..
-
KTR : రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్..
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
-
Harish Rao : 1000 రోజులు.. హామీలు ఎక్కడ? హరీశ్ రావు బిగ్ కౌంటర్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!