నందమూరి నట సింహం బాలకృష్ణ నేడు 62 వ వసంతంలోకి అడుగుపెట్టిన విషయం విదితమే.. నేడు బాలయ్య పుట్టినరోజు కావడంతో సినీ, రాజకీయ ప్రముఖులు బాలయ్యకు ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుండగా.. బాలయ్య అభిమానులు ఆయన పుట్టినరోజును మరింత స్పెషల్ గా చేటు సోషల్ మీడియాలో ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఇక అభిమానులకు ఎప్పటిలానే బాలయ్య బాబు తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ తో మంచి కిక్ ఇచ్చారు. తాజాగా బాలయ్య పుట్టినరోజు వేడుకలు ఆయన నివాసంలో ఘనంగా జరిగాయి.. ముఖ్యంగా ఈ ఏడాది బాలయ్య పుట్టినరోజు ఎంతో ప్రత్యేకమని చెప్పాలి.. అఖండ విజయం, మొట్టమొదటిసారి ఆయన ఒక టాక్ షో లో పాల్గొనడం.. అది కూడా వైరల్ గా మారి బాలకృష్ణకు మరింత పేరు తీసుకురావడం.. ఈ విజయాలతో బాలయ్య ఆనందానికి అవధులు లేవు.
ఇక ఈ పుట్టినరోజును నందమూరి నటసింహం తన మనవళ్లతో చేసుకోవడం విశేషం .. బాలయ్య ఇద్దరు కూతుళ్ల కొడుకులు తాతగారికి ఒక మంచి గిఫ్టును ఇచ్చారు. NBK అని రాసి ఉన్న ఆ గిఫ్ట్ ను అందుకున్న బాలయ్య ముఖంలో చిరునవ్వులు విరిసాయి. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం బాలయ్య, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK 107 సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి వదిలిన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.