నందమూరి బాలకృష్ణ ఇటీవలే 62 వ పుట్టినరోజు జరుపుకున్న విషయం విదితమే.. ఇక బాలయ్య పుట్టినరోజు అంటే అభిమానులకు పండుగతో సమానం.. పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అన్నదానాలు ఇలా ఒక్కటి ఏంటి .. ఆయన బర్త్ డే ను ఒక జాతరలా చేస్తుంటారు. ఇక సోషల్ మీడియాలో అభిమానులతో పాటు స్టార్ హీరోలు బాలయ్యకు స్పెషల్ బర్త్ డే విషెస్ తో మారుమ్రోగించేస్తారు. అయితే ఈ సంవత్సరం మాత్రం స్టార్ హీరోలు, బాలయ్య పుట్టినరోజును పట్టించుకోలేదన్న వార్త వినిపిస్తోంది. ఎందుకంటే.. ఈ ఏడాది బాలయ్య బర్త్ డే అందరూ మర్చిపోయినట్లు కనిపిస్తున్నారు. సాధారణంగా సినీ ప్రముఖులు పుట్టినరోజు జరుపుకుంటే.. మిగతా నటీనటులు నేరుగా కలిసో లేదా సోషల్ మీడియా వేదికగానో శుభాకాంక్షలు తెలుపుతుంటారు. ఆ రేర్ ఫోటోల కోసం అభిమానులు ఎదురుచూస్తూ ఉంటారు. కానీ ఈసారి బాలయ్యకు అలాంటి శుభాకాంక్షలు ఏమి రాకపోయేసరికి బాలయ్య ఫ్యాన్స్ హర్ట్ అవుతున్నారు. గతేడాది బాలకృష్ణ కు శుభాకాంక్షలు తెలిపిన మెగాస్టార్ చిరంజీవి – విక్టరీ వెంకటేష్ – మంచు మోహన్ బాబు లాంటి పలువురు సీనియర్ స్టార్స్ ఈసారి విషెస్ చెప్పలేదు.
ఇక బాలయ్య అన్న కొడుకులు, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సైతం బాబాయ్ బర్త్ డే మర్చిపోయినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ గుర్రు మంటున్నారు. బాలయ్య బాబాయ్ కు పుట్టినరోజున విషెస్ చెప్తూ ఒక్క ట్వీట్ వేస్తె ఏమి పోయేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యతో సన్నిహితంగా ఉండేవారు కూడా సైలెంట్ గా ఉన్నారు. ఇది సీనియర్ హీరోని అవమానించినట్లేనని ఆయన అభిమానులు అంటున్నారు. ఇక మరోపక్క ట్వీట్ చేయకపోతే పర్సనల్ గా ఫోన్ చేసి ఉంటారు.. నిజానిజాలు తెలియకుండా నిందలు వేయడం మంచిది కాదని మరికొందరు హితవు పలుకుతున్నారు. ఏదిఏమైనా ఈసారి బాలయ్య బర్త్ డే చప్పగా జరిగిందని మాత్రం తెలుస్తోంది.