Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్సకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, స్పెషల్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలయ్య పవర్ ఫుల్ లీడర్ గా కనిపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. అంతే కాకుండా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి అన్నగారు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారట. ఇటీవలే కరోనా బారిన పడి కోలుకున్న బాలయ్య తాజాగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు.
కర్నూల్ పరిసర ప్రాంతాలలో సినిమాను పూర్తిచేస్తున్నారు. ఇక సెట్స్ లో అభిమానులతో కలిసి బాలకృష్ణ దిగిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. NBK 107 ఫస్ట్ లుక్ లో బ్లాక్ అవుట్ ఫిట్ లో కనిపించిన బాలయ్య.. తాజాగా వైట్ అండ్ వైట్ లుక్ లో కనిపించి మెప్పించాడు. తెల్లటి ఖద్దరు దుస్తులు.. తెల్లని చెప్పులు వేసుకొని అవుట్ అండ్ అవుట్ పొలిటికల్ లీడర్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ ఫోటో చూసిన వారందరు బాలయ్య నటించిన సమరసింహ రెడ్డి ను గుర్తుచేసుకుంటున్నారు. గోపీచంద్ మలినేని, బాలకృష్ణ తో ‘సమరసింహా రెడ్డి’ సీక్వెల్ అయితే తీయడం లేదు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈ చిత్రం తరువాత బాలయ్య, అనిల్ రావిపూడి దర్సకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈ సినిమా కూడా సెట్స్ మీదకు వెళ్లనుంది.