పలు సీరియల్స్, సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్ళా స్వీయ దర్శకత్వంలో టి. ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూనిట్ కృషిని అభినందించారని, అయితే కంటెంట్ కారణంగా సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని దర్శక నిర్మాతలు తెలిపారు. సిరి హనుమంతు…