పలు సీరియల్స్, సినిమాల ద్వారా తెలుగువారికి సుపరిచితుడైన నందకిశోర్ హీరోగా పరిచయమవుతున్న సినిమా ‘నరసింహపురం’. శ్రీరాజ్ బళ్ళా స్వీయ దర్శకత్వంలో టి. ఫణిరాజ్ గౌడ్, నందకిశోర్ ధూళిపాలతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ ఫ్యామిలీ ఓరియెంటెడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ సెన్సార్ కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు యూనిట్ కృషిని అభినందించారని, అయితే కంటెంట్ కారణంగా సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారని దర్శక నిర్మాతలు తెలిపారు. సిరి హనుమంతు హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో వర్థమాన నటి ఉష హీరో చెల్లెలు పాత్రను పోషించింది. కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టగానే, థియేటర్లు ఎప్పుడు తెరిస్తే అప్పుడు తమ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు చెబుతున్నారు. ఫ్రాంక్లిన్ సుకుమార్ సంగీతం అందించిన ‘నరసింహపురం’లో ఇతర ప్రధాన పాత్రలను కళ్యాణ మాధవి, ‘లక్ష్మీస్ ఎన్టీయార్’ ఫేమ్ విజయ్ కుమార్, రంగధామ్, రవివర్మ, సంపత్, స్వామి, శ్రీకాంత్, శివ, జునైద్, గిరిధర్, సాయిరాజ్ తదితరులు పోషించారు.
Read Also : “బీస్ట్” కోసం బుట్టబొమ్మ డ్యాన్స్ రిహార్సల్స్