Gujarat university issue: క్యాంపస్ లో అమ్మాయి నమాజ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం గుజరాత్ లో చర్చనీయాంశంగా మారింది. వడోదరలోని ఎంఎస్ యూనివర్శిటీ వర్సిటీ ప్రాంగణంలో ఒక అమ్మాయి నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం కఠిన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని పలు మతసంస్థలు డిమాండ్ చేశాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన ఉద్రిక్తతలకు కారణం అయింది.
కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ సంతకాల సేకరణ చేపట్టడంపై తెలంగాణ బీజేపీ అద్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌కు దమ్ముంటే భాగలక్ష్మి ఆలయంపై చేయి వేయాలంటూ సవాల్ విసిరారు. ‘‘మేం భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుంటేనే.. మీకు నమాజ్ గుర్తొచ్చిందా?. అంతకుముందు నమాజ్ ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్‌ఎస్ కలిసి డ్రామాలాడుతున్నాయి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చార్మినార్ దగ్గర ఆలయం లేదని చెప్పేవాడు మూర్ఖుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలే…
ఉత్తర్ ప్రదేశ్ ఆగ్రాలోని తాజ్ మహల్ వద్ద నమాజ్ చేసినందుకు నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇందులో ముగ్గురు హైదరాబాద్ కు చెందిన వారు కాగా.. ఒకరు ఆజాంగఢ్ కు చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. బుధవారం సాయంత్రం తాజ్ మహల్ పరిధిలోని షాహీ మసీదులో నమాజ్ చేశారు. దీంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు, సీఐఎస్ఎఫ్ అధికారులు నలుగురిని పోలీసులకు అప్పగించారు. నలుగురిపై ఐపీసీ సెక్షన్ 153 కింద కేేసు నమోదు చేసి కోర్టులో…