Gujarat university issue: క్యాంపస్ లో అమ్మాయి నమాజ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం గుజరాత్ లో చర్చనీయాంశంగా మారింది. వడోదరలోని ఎంఎస్ యూనివర్శిటీ వర్సిటీ ప్రాంగణంలో ఒక అమ్మాయి నమాజ్ చేస్తున్న వీడియో వైరల్ కావడంతో యూనివర్సిటీ యాజమాన్యం కఠిన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థిపై చర్యలు తీసుకోవాలని పలు మతసంస్థలు డిమాండ్ చేశాయి. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన ఉద్రిక్తతలకు కారణం అయింది.
Read Also: Hindu Temple Vandalised: ఖలిస్తానీ మద్దతుదారుల దుశ్చర్య.. మరో హిందూ ఆలయంపై దాడి..
తాజాగా ఈ వివాదంతో ఎంఎస్ యూనివర్సిటీ అధికారులు క్యాంపస్ లోపల మతపరమైన కార్యకలాపాలను నిషేధిస్తూ నోటీసులు జారీ చేశారు. వీడియో వైరల్ కావడంతో సంబంధిత విద్యార్థిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవడానికి ఉన్నత స్థాయి విచారణను ప్రారంభించారు. యూనివర్సిటీ ప్రాంగణంలో ఎలాంటి మతపరమైన కార్యకలాపాలు నిర్వహించడం మంచిది కాదు. అందువల్ల, విద్యార్థులు మరియు అధ్యాపకులు అందరూ మతపరమైన కార్యకలాపాలకు అనుమతి లేదని ఆదేశించారు. ఈ ఆదేశాన్ని ఉల్లంఘిస్తే తగిన క్రమశిక్షణా చర్య తీసుకోవలసి ఉంటుందని యాజమాన్య హెచ్చరించింది. రెండు నెలల్లో ఇలాంటి వి మూడు సంఘటనలు జరిగినట్లు తెలిసింది. అనేక హిందూ సంఘాలు విశ్వవిద్యాలయంలో నమాజ్ చేయడంపై అభ్యంతరం తెలుపుతున్నాయి.