తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై తీవ్ర దుమారమే రేగింది.. అయితే, ఈ వ్యవహారంలో వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై ఏపీ హైకోర్టు సీరియస్ అయ్యింది..
కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరోసారి విమర్శలు చేశారు. డబ్బుందన్న అహంకారంతో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్ది ఇలాంటి దాడులు చేయిస్తుందన్నారు. దాడులు చేసే సంస్కృతిని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి నెల్లూరు జిల్లాకు పరిచయం చేశారని విమర్శించారు. తాను ఎక్కడికీ పారిపోలేదని, ఇప్పుడే వచ్చి అరెస్టు చేసుకోవచ్చన్నారు. తాను నెల్లూరు వదిలి వెళ్లి ఎక్కడో దాక్కున్నట్లు చెప్పడం హాస్యాస్పదం అని ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రసన్న కుమార్…
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రెడ్డిపాలెం మునులపూడి గ్రామాలలో కోవూరు వైసీపీ అభ్యర్థి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ధనవంతులు చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారని, ఎప్పుడూ కనబడని వ్యక్తులు ఎన్నికలు రావడంతో మన దగ్గరకు వస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. కరోనా సమయంలో గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు మేము మీ మధ్య తిరిగి ధైర్యం చెప్పామని, అప్పుడు తెలుగుదేశం,బిజెపి జనసేన,కాంగ్రెస్,…
నెల్లూరు ( Nellore ) జిల్లాలోని కోవూరులో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి ( Vijaysai Reddy) పరిచయ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కోవూరులో వైసీపీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయన్నారు. 'సి' ఓటర్ సర్వేలో మాత్రం చంద్రబాబు అధికారంలోకి వస్తారని చెబుతోందని తెలిపారు. సి ఓటర్ సర్వే చంద్రబాబు చెంచా లాంటిదని దుయ్యబట్టారు.
చంద్రబాబు ఆరోగ్యంపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 25 సంవత్సరాల నుంచి చంద్రబాబుకి చర్మ వ్యాధులు ఉన్నాయని.. ఇది అందరికీ తెలుసన్నారు.