నల్గొండ జిల్లాలో దారుణం చోటుచేసుకొంది. భర్త చెప్పిన మాట వినడంలేదని భార్య అతిదారుణంగా హతమార్చింది. అంతేకాకుండా ఉదయం తనకేమి తెలియదన్నట్లు భర్త కల్తీ మందు తాగి మృతిచెందినట్లు డ్రామా ఆడింది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. శేరిపల్లి పెద్దతండాకు చెందిన రమావత్ మోతీలాల్(45) కు కొన్నేళ్ల క్రితం లలితతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరి కాపురంలో కలతలు చెలరేగాయి. దీంతో లేత పిల్లలను…
నల్లగొండ పట్టణాభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. రాష్ట్రంలోని అన్ని పట్టణాల మాదిరిగానే చారిత్రక నల్లగొండ మున్సిపాలిటీ కూడా మరింతగా అభివృద్ధి చెందాలని.. నల్లగొండకు దశాబ్దాలుగా పట్టిన దరిద్రం పోవాలని.. ఇందుకోసం ప్రభుత్వం ఎంత ఖర్చుకైనా వెనకాడబోదని వెల్లడించారు.. నల్లగొండను అన్ని హంగులు, మౌలిక వసతులతో తీర్చిదిద్దాలని ఆదేశించిన కేసీఆర్.. అభివృద్ధికి ప్రభుత్వం సరిపడా నిధులు ఇస్తుందని.. ఇందుకు తక్షణమే కార్యాచరణకు పూనుకోవాలని స్పష్టం చేశారు.. నల్లగొండ పట్టణ అభివృద్ధి కోసం, అణువణువూ…
తెలంగాణ పరిధిలో సత్తుపల్లి, కొత్తగూడెం, శ్రావణపల్లి, కళ్యాణ్ ఖని లోని నాలుగు బొగ్గుగనుల వేలం వేయడాన్ని సింగరేణి కార్మికులు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. బొగ్గుగనుల వేలం ప్రక్రియను కేంద్రం విరమించుకోవాలని కోరుతూ మూడు రోజులపాటు కార్మికులు సమ్మె చేశారు. ఈ సమ్మెకారణంగా తెలంగాణలో బొగ్గు ఉత్పత్తి ఆగిపోయింది. దీంతో సింగరేణికి సుమారు రూ. 120 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లింది. లోక్‌సభలో ఈరోజు జీరో అవర్‌లో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి బోగ్గుగనుల వేలం…
తూర్పు లద్దాఖ్ గాల్వాన్ లోయ ప్రాంతంలో గత సంవత్సరం జూన్ 15 రాత్రి చైనా సైనికులతో జరిగి ఘర్షణలో వీరోచితంగా పోరాడి అమరుడైన కల్నల్ సంతోష్‌బాబుకు ‘మహావీర చక్ర’ పురస్కారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కల్నల్ సంతోష్ బాబు సతీమణి సంతోషి, ఆయన మాతృమూర్తి మంజుల ఈ అవార్డును రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. గత సంవత్సరం గాల్వాన్ లోయలో 16-బీహార్ రెజిమెంట్‌కు కమాండింగ్ చీఫ్‌గా కల్నల్ సంతోష్ నేతృత్వం…
తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం రాజకీయపార్టీల మధ్య యుద్ధంగా మారుతోంది. పరస్పరం విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టేందుకే సిద్ధమైంది బీజేపీ. ఇవాళ, రేపు నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటించనున్నారు. సోమవారం ఉదయం 10.30 కి నల్గొండ కి చేరుకోనున్నారు బండి సంజయ్. చర్లపల్లి బైపాస్ వద్ద ఘన స్వాగతం బీజేపీ శ్రేణులు స్వాగతం పలకనున్నాయి. అనంతరం ఆర్జాలబావి…
తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. మళ్లీ ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.. క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలిస్తూ.. దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నారు.. ఇక, నల్గొండ ఆర్టీసీ డిపోల్లో ఆకస్మిక తనిఖీలు చేవారు సజ్జనార్.. అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్గో సేవలు మంచి ఫలితాలు ఇస్తున్నాయని.. రైతులకు కూడా ఉపయోగపడేలా కార్గో సేవలు అందించనున్నట్టు వెల్లడించారు.. రెండేళ్లుగా 30 శాతం డీజిల్ ధరలు పెరగడంతో…
నవంబర్ 15న వరంగల్‌లో తలపెట్టిన మహాగర్జన సభకు భారీగా టీఆర్ఎస్ కార్యకర్తలు తరలి రావాలని మంత్రి జగదీష్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రతిపక్షాలపై విమర్శలు చేశారు. ఎన్నికలలో ఇచ్చిన హామీలను పూర్తి చేయడంతో పాటు ఇవ్వని హామీలను కూడా పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న అభివృద్ధిని జీర్ణించుకోలేక ప్రతిపక్షాలు నిందించడమే పరమావధిగా పెట్టుకున్నాయని, ప్రతిపక్ష పార్టీలపై ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వాలు తొందరగా పూర్తి చేసుకున్న…
మాజీ మంత్రి చేరిక.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోందా? ఆయన రాజకీయ భవిష్యత్‌పై ఇంకా క్లారిటీ లేకపోయినా.. ఎమ్మెల్యేలు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కలవర పడుతున్న ఆ ఎమ్మెల్యేలు ఎవరు? మోత్కుపల్లి చేరికతో.. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలలో గుబులు..! మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు గులాబీ కండువా కప్పుకొన్న తర్వాత.. ఆ చేరిక ప్రకంపనలు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో కనిపిస్తున్నాయి. పైకి ఎవరూ చెప్పకపోయినా.. కొందరు ఎమ్మెల్యేలు తమకేమైనా గండం పొంచి…
నల్గొండ ఎంజీ యూనివర్సిటీ ఎదుట వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మీడియా సమావేశం నిర్వహించారు. అందులో ఆవిడ మాట్లాడుతూ… ఎంజీ యూనివర్సిటీ వైఎస్సార్ కట్టించినది. పేద బిడ్డలకు విద్యను అందించేందుకు వైఎస్సార్ యూనివర్సిటీ నిర్మిస్తే కనీసం ఒక్క ప్రొఫెసర్ పోస్టు భర్తీ కూడా చేపట్టలేదు. ఎంజీ యూనివర్సిటీలో 10 మంది ప్రొఫెసర్లకు అందరూ ఖాళీలు. 50 శాతం స్టాఫ్ తో యూనివర్సిటీ నడుస్తోంది. యూనివర్సిటీ సమస్యలపై ఎన్ని లెటర్ లు రాసినా పట్టించుకునే నాధుడే లేరు.…
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రేపు నల్గొండ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.. నల్గొండ పట్టణంలోని సింధూర హాస్పిటల్ లో కిడ్నీ కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ల ప్రారంభోత్సవంలో పాల్గొననున్నారు గవర్నర్.. ఆ తర్వాత ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బిల్డింగ్ లో 2వ అంతస్తులో సెమినార్ హాల్‌ను ప్రారభించనున్నారు.. ఇక, అనంతరం పానగల్ ఛాయా సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న ఆమె.. మొక్కలు నాటే కార్యక్రమంలోనూ పాల్గొననున్నారు.. తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మహాత్మా గాంధీ విగ్రహ…