రేపటి నుంచి నాగోబా జాతర మొదలవనుంది. మంగళవారం రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. కాగా.. కేస్లాపూర్ నాగోబా జాతర రేపు రాత్రి గంగాజలాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
Nagoba Jatara: గిరిజన బిడ్డల సంబరాలు అంబరాన్ని తాకే నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో జరుగుతున్న నాగదేవత నాగోబా జాతర కన్నుల పండువగా కొనసాగుతోంది.
ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబాకు సాంప్రదాయ పూజలతో ఆదివారం మహా క్రతువు మొదలైంది. ఆదిలాబాద్ కేస్లాపూర్‌లో నాగోబా జాతర తేదీలను నిర్ణయించారు మేస్త్రం వంశీయులు. పుష్యవాస అమావాస్యను పురస్కరించుకొని ఫిబ్రవరి 9 నుండి మొదలయ్యే కేస్లా పూర్ నాగోబా జాతర ఉత్సవాల కోసం ఆదివారం నాడు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ సన్నిధిలో మెస్రం వంశీయులు సమావేశమై పాదరక్షలు లేకుండా కాలినడకన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం గోదావరి నది హస్తినమడుగు ప్రాంతానికి బయలుదేరారు. సుమారు…
మెస్రం వంశీయులు తమ వార్షిక నాగోబా జాతరను ఆదివారం ఇందర్వెల్లి మండలం కేస్లాపూర్ గ్రామంలో కచూర్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఐదు రోజుల పాటు జరిగే నాగోబా జాతర మెస్రం వంశీయుల ముఖ్యమైన ధార్మిక మరియు సాంస్కృతిక వ్యవహారం. జాతర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని మెస్రం వంశీయులు కులపెద్ద వెంకట్రావు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. 10 రోజుల పాటు ఇందర్వెల్లి, ఇచ్చోడ, బజరహత్నూర్ మండలాల్లోని గ్రామాల్లో ప్రత్యేక ఎద్దుల బండిని ఉపయోగించి ఎద్దుల బండ్లపై తిరుగుతూ జాతర గురించి…
Keslapur Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర నిన్న అర్థరాత్రి వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ఉత్సవాలు నేటి నుంచి 28వ తేది వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇవాళ నాగోబా జాతరకు వెళ్లేందుకు హైదరాబాద్ కు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా చేరుకున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి హెలికాప్టర్…
ఆదీవాసీలు అత్యంత వైభవంగా జరుపుకునే నాగోబా జాతరకు వేళయింది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర శనివారం అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది.
అడవి బిడ్డల అద్భుత జాతర నాగోబా జాతర నేటి నుంచి ఘనంగా ప్రారంభంకానుంది. గంగాజలాభిషేకంతో ప్రారంభమయ్యే నాగోబా జాతర పుష్య మాసం అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే.. ఆదిలాబాద్‌లోని కేస్లాపూర్‌లో వెలుగుల వెలుగుల మధ్య జాతర ప్రారంభమవుతుంది.
నాగోబా ఆలయ పునర్నిర్మాణం పూర్తికావడంతో వారం రోజులుగా పూజలు కొనసాగుతున్నాయి. నేడు ధ్వజ స్తంభం, విగ్రహ ప్రతిష్ఠాపన, ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మెస్రం ప్రజలు హాజరుకానున్నారు.