Keslapur Nagoba Jatara: నాగోబా జాతరకు బయలుదేరిన అర్జున్ ముండా, బండి సంజయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Keslapur Nagoba Jatara: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో నాగోబా జాతర నిన్న అర్థరాత్రి వైభవంగా ప్రారంభమైంది. ప్రతీ ఏడాది పుష్యమాస అమావాస్య రోజున అర్ధరాత్రి మెస్రం వంశీయుల మహా పూజలతో నాగోబా జాతర ఉత్సవాలు నేటి నుంచి 28వ తేది వరకు జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఇవాళ నాగోబా జాతరకు వెళ్లేందుకు హైదరాబాద్ కు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా చేరుకున్నారు. అనంతరం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుండి హెలికాప్టర్ లో నాగోబా జాతరకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ బయలుదేరారు. కేస్లాపూర్ చేరుకుని గిరిజన ఆరాధ్యదైవమైన నాగోబాను దర్శించుకోనున్నారు నేతలు. నాలుగు గంటలపాటు గిరిజనులతో కలిసి వివిధ కార్యక్రమాల్లో నేతలు పాల్గొననున్నారు. మధ్యాహ్నం స్థానిక ఫంక్షన్ హాలులో పాల్గొని అర్జున్ ముండా, బండి సంజయ్ ప్రసంగించనున్నారు. అనంతరం సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకోనున్న నేతలు.
Read also: Unstoppable: బాలయ్యతో మెగా మామ-అల్లుడు
Also Read
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Indiramma Towers: గుడ్‌న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా జరగనున్న ఈ జాతరకు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తినమడుగు నుంచి సేకరించిన గంగా జలాన్ని మట్టికుండలలో మెస్రం వంశ మహిళలు అందిస్తారు. గిరిజన సాంప్రదాయ డోలు, పెప్రి, కాళికోం వాయిద్యాలతో పూజాసామాగ్రిని గంగాజలంతో పాటు శోభాయాత్ర నిర్వహించి నాగోబా అలయానికి వెళ్లి పూజలు చేస్తారు. ఆలయ ప్రాంగణంలో ఏడు పుట్టల వద్ద నవ ధాన్యాలు, ఆవు పాలు, నైవేద్యాలు సమర్పిస్తారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ జాతర నేడు రాత్రి 10 గంటలకు నాగోబాకు మహాపూజతో ప్రారంభంకానుంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నలుమూలల నుండే కాకుండా వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో భక్తులు జాతరకు తరలివస్తారు. ఈ నెల 24న నిర్వహించే దర్బార్ సమావేశానికి రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హారరుకానున్నారు. గిరిజన సంక్షేమ శాఖ, దేవాదాయ శాఖలు రాఘవ జాతరకు కావలసిన రహదారులు, తాగునీరు, మౌలిక వసతులకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ ఆర్.ఎం. జానీరెడ్డి మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందుకులు కలగకుండా.. నిర్మల్, ఉట్నూర్, అసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ డిపోల నుంచి నేటి నుంచి 28వరకు ప్రత్యేక బస్సులు నడపనుందని ప్రకటించారు.
Che Guevara: హైదరాబాద్ కు చేగువేరా కూతురు, మనవరాలు.. క్యూబా సంఘీభావ సభలో..
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!