సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. ఇదే మీకు ఆఖరి అవకాశం. బడ్జెట్ లో ఇచ్చిన హామీలన్నింటికీ నిధులు కేటాయించండి. అసెంబ్లీ వేదికగా ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి అని ఆయన ప్రశ్నించారు. అతిపెద్ద నాగోబా జాతరను విస్మరించిన కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన విరుచుకుపడ్డారు. గిరిజనులంటేనే కేసీఆర్ కు చులకన.. ఆదివాసీ బిడ్డ రాష్ట్రపతి కాకుండా ఓడించేందుకు కుట్ర చేశారు. పోడుభూములకు పట్టాలిస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి కేసీఆరే అన్నారు.
ముస్లిం రిజర్వేషన్లతో ముడిపెట్టి గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అమలు కాకుండా కుట్ర చేశారన్నారు. తండాలకు నిధులివ్వకుండా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటున్నాడన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేశం గర్వపడేలా నాగోబా జాతరను ఘనంగా నిర్వహిస్తాం అన్నారు. అర్హులందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య, వైద్యాన్ని అందిస్తాం అని ఆయన హామీ ఇచ్చారు. నిలువనీడలేని వాళ్లందరికీ ఇండ్లు నిర్మిస్తాం… రైతులకు పంట నష్టపరిహారం అందిస్తాం అన్నారు ఎంపీ బండి సంజయ్ కుమార్.
Read Also: Los Angeles Shooting: లాస్ ఏంజిల్స్ లో కాల్పులు.. పలువురు మృతి
కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండాతో కలిసి ఈరోజు ఉదయం నాగోబా జాతరకు విచ్చేసిన బండి సంజయ్ నాగోబా ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గౌరవ వందనంతో అర్జున్ ముండా, బండి సంజయ్ లకు అధికారులు ఘన స్వాగతం పలికారు. మెస్రం వంశం పక్షాన బండి సంజయ్ కు, అర్జున్ ముండాకు ఆదివాసీలు స్వాగతం పలికారు.
బండి సంజయ్ రాకతో నాగోబా జాతరకు పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం కేస్లాపూర్ నాగోబా జాతర ‘‘దర్బార్’’ కు హాజరై ఆదివాసీలను ఉద్దేశించి ప్రసంగించారు. అందరికీ నాగోబా జాతర శుభాకాంక్షలు. నాగోబా ను సందర్శించి ఆశీర్వాదం తీసుకోవడానికి మేం ఇక్కడికి వచ్చాం.దేశంలోనే అతిపెద్ద 2వ జాతర నాగోబా. ఇక్కడికి వచ్చి నాగోబాను సందర్శించుకోవడం పూర్వ జన్మసుకృతం అన్నారు. తెలంగాణ ప్రజలను రాచిరంపాన పెట్టిన నిజాం వారసుడు పరాయి దేశంలో చనిపోతే హైదరాబాద్ కు తీసుకొచ్చి అత్యున్నత అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న కేసీఆర్ ఆదివాసీలను ఎందుకు పట్టించుకోవడం లేదు? అన్నారు.
Read Also:Twitter: యాడ్స్ ఫ్రీగా ట్విట్టర్.. కానీ కండిషన్స్ అఫ్లై.. ఎలాన్ మస్క్ మరో బిగ్ మూవ్..