Unstoppable 2: టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ ఆహాలో ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్ బి కె’ షోను ప్రారంభించడంతోనే అది ఇన్ స్టెంట్ హిట్ అయిపోయింది. బాలకృష్ణ తనదైన శైలిలో క్లిష్టమైన, వివాదాస్పదమైన ప్రశ్నలను కూడా సరదాగా సంధించేసి, ఎదుటి వాళ్ళ నుండి సమాధానాలు రాబట్టడం అందరికీ నచ్చేసింది. బాలకృష్ణ సమకాలీనులైన సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ ఈ షో ఫస్ట్ సీజన్‌లో పాల్గొనలేదు. దాంతో ఇటు బాలకృష్ణ అభిమానులతో పాటు…
Bigg boss 6: బిగ్ బాస్ సీజన్ 6 లో హౌస్ ఆరవ కెప్టెన్ గా ఆర్జే సూర్య ఎంపికయ్యాడు. లాస్ట్ వీక్ త్రుటిలో తప్పిపోయిన ఈ ఛాన్స్ ఇప్పుడు సూర్యకు దక్కడం హౌస్ లోని అందరికీ ఆనందాన్ని కలిగించింది. ఎంతగా అంటే... తొమ్మిది మంది సూర్య కెప్టెన్ కావాలని కోరుకోగా, ఇద్దరు మాత్రమే రోహిత్ కు ఓటు వేశారు.
బిగ్‌బాస్ సీజన్ 6లో ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతాడని భావించిన చలాకీ చంటీ ఈ వారం ఎలిమినేషన్‌కు గురయ్యాడు. అతనికి వ్యూవర్స్ నుండి మంచిగానే ఓట్లు పడే ఆస్కారం ఉన్నా, హౌస్ నుండి బయటకు రావడం వెనుక వేరే కారణం ఉందని భావిస్తున్నారు.
బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ ను హీరోగా పరిచయం చేస్తూ పికెఎకె ఫిలిమ్స్ నిర్మిస్తున్న సినిమాకు 'బ్లాక్ డాగ్' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇటీవల తన పరిచయం గురించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన బాడీ లాంగ్వేజ్ విషయంలో విపరీతంగా ట్రోల్ కి గురయ్యాడు చంద్రహాస్.
Dussehra Fight:టాలీవుడ్ టాప్ స్టార్స్ అనగానే ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు ఆ నలుగురే గుర్తుకు వస్తారు. ఆ తరువాతే నవతరం కథానాయకులను లెక్కిస్తారు. అంతలా అలరించారు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్.
బిగ్ బాస్ సీజన్ 6లో గత మూడు వారాలుగా పెడుతున్న టాస్కులు ఏమంత ఆసక్తికరంగా లేవు. దాంతో గత సీజన్స్ లోని టాస్క్ లతో పోల్చి వ్యూవర్స్ పెదవి విరుస్తున్నారు. కనీసం వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడైనా చూసి ఎంజాయ్ చేద్దామంటే ఆ ఎపిసోడ్స్ కూడా పెద్దంత ఇంట్రస్ట్ ను కలిగించడం లేదు.
The Ghost Release Trailer: అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహన్ జంటగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ది ఘోస్ట్. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై సునీల్ నారంగ్ - పుస్కుర్ రామ్ మోహన్ రావు - శరత్ మరార్ సంయుక్తంగా నిర్మించారు.