Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ మరో మూడు వారాల్లో ముగియనుంది. 11వ వారం వీకెండ్ ఎపిసోడ్ హాట్ హాట్‌గా సాగింది. శనివారం నాటి ఎపిసోడ్‌లో ముఖ్యంగా హోస్ట్ నాగార్జున, ఆదిరెడ్డి మధ్య వాదోపవాదనలు జరిగాయి. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా రేవంత్‌తో జరిగిన డిస్కషన్‌లో ఆదిరెడ్డిదే తప్పు అనే విధంగా వీడియో వేసి మరీ నాగార్జున చూపించారు. కానీ అసలు వాదన టీవీ ఎపిసోడ్‌లో ప్రసారం కాలేదని.. ఆడవాళ్లతో ఆడదామని.. అది కూడా గేమ్ అని రేవంత్ చెప్పాడని నెటిజన్‌లు నాగార్జునను ట్రోల్ చేస్తున్నారు. ఆదిరెడ్డి విషయంలో బిగ్‌బాస్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు. నాగార్జున కూడా అంత రూడ్‌గా బిహేవ్ చేయాల్సిన అవసరం లేదని హితవు పలుకుతున్నారు.
Read Also: Kantara 2 Update: కాంతార 2 అప్పుడే వచ్చేది.. అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
ఆదిరెడ్డి విషయంలో ఒకలా.. రేవంత్, శ్రీహాన్ విషయంలో మరోలా బిగ్‌బాస్ యాజమాన్యం వ్యవహరిస్తోందని నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు వీడియో ప్రసారం చేయకుండా కొసరు వీడియోతో ఆదిరెడ్డిని తప్పుబట్టడం ఏకపక్షంగా వ్యవహరించడమేనని.. రేవంత్‌ను విన్నర్ చేయాలని చూస్తున్నారా అంటూ ఆదిరెడ్డి అభిమానులు బిగ్‌బాస్‌ను నిలదీస్తున్నారు. ఈ మేరకు 24/7 స్ట్రీమ్‌లోని వీడియోను వైరల్ చేస్తున్నారు. అటు కెప్టెన్సీ టాస్క్ ఆడిన ఆదిరెడ్డి ఎవిక్షన్ ఫ్రీపాస్ కోసం నిర్వహించిన టాస్క్‌లో ఆడకపోవడాన్ని కూడా నాగార్జున తప్పుబట్టాడని.. తనకు అవసరం లేకుండా ఎవరినో రక్షించడానికి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం ఆదిరెడ్డి ఎందుకు ఆడాలని.. అతని ఆలోచనలను ఎలా తప్పుబడతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను ఆడటం కంటెస్టెంట్ల బాధ్యత అని.. ఈ విషయంలో ఆదిరెడ్డిదే తప్పు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
Bigg boss is targeting adireddy 😔
All reviewers vs adireddy#targettingadireddy#adireddy@adireddyfantasy @GeetuRoyal @Rahulsipligunj pic.twitter.com/n3Dj2nOUOS— Harsha (@Harsha99759812) November 19, 2022