తెలంగాణ లోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట నాగార్జున సాగర్. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో, అలాగే ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. అలంటి ప్రాజెక్ట్ కు ఇప్పుడు నీటి కష్టాలు వచ్చాయి. తీవ్ర వర్షం పరిస్థితుల నేపథ్యంలో నాగార్జునసాగర్ జలాలూ అడుగంటుతున్నాయి. డ్యామ్ లో డెడ్ స్టోరేజ్ కి నాగార్జునసాగర్ నీటిమట్టం చేరుకుంది. ఇక ప్రాజెక్టు గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 312 TMC లు ఉండగా ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వ 130 TMC లుగా ఉంది.
Also Read: Patanjali Honey : తేనె నమూనా పరీక్షలో విఫలమైన పతాంజలి.. రూ.లక్ష జరిమానా
ఇక ప్రస్తుతం నీటిమట్టం 509.70 కు చేరుకుంది. ఇక నీటి నిల్వలు డెడ్ స్టోరేజ్ కి చేరుకోవడంతో సాగునీటి విడుదలకు నో ఛాన్స్ అన్నట్లుగా మారింది. ఒకవేళ మళ్లీ సాగర్ కు ఇన్ ఫ్లో మొదలైతేనే సాగునీటి విడుదల సాధ్యం అంటున్నారు అధికారులు. ఇదివరకు ఎప్పుడు లేనంతగా.. గతానికి భిన్నంగా ఏప్రిల్ నెలలోనే లో స్టోరేజ్ కి చేరుకుంది నాగార్జునసాగర్. ఇక ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 590 అడుగులు ఉండగా.. ప్రస్తుతం ప్రాజెక్టు నీటిమట్టం అడుగులలో 509.70 గా ఉన్నాయి.
ఇక సాగునీటి అవసరాల కోసం హైదరాబాద్ కు తాగునీటి కోసం 1350 క్యూసెక్కుల విడుదల చేయగా.. మొత్తంగా కుడికాలువ ద్వారా తాగు నీటి కోసం 5394 క్యూసెక్కుల విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.