అన్నపూర్ణ స్టూడియోస్ తో పాటు అక్కినేని నాగార్జునకు పర్శనల్ మేకప్ మేన్ గా పనిచేసిన బొమ్మదేవర రామచంద్రరావు గతంలో అనుష్క నాయికగా ‘పంచాక్షరి’ చిత్రాన్ని సముద్ర దర్శకత్వంలో నిర్మించారు. ఇప్పుడు బొమ్మదేవర శ్రీదేవి సమర్ఫణలో సాయిరత్న క్రియేషన్స్ బ్యానర్ లో రెండో చిత్రానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సినిమాకు ఆయనే దర్శకత్వం వహిస్తున్నారు. మరో విశేషం ఏమంటే ఈ సినిమా ద్వారా తన కొడుకు తేజ్ బొమ్మదేవరను హీరోగా పరిచయం చేస్తున్నారు. రిషిక లోక్రే…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టిక్కెట్ ధరలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనే బలమైన భావన టాలీవుడ్ ప్రముఖుల్లో ఉంది. అయితే ఈ విషయంపై నాగార్జున స్పందించిన తీరుపై విమర్శలు వచ్చాయి. సినిమా టికెట్ రేట్లతో తనకేం సమస్య లేదని నాగార్జున చెప్పడం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది. తాజాగా నాగ చైతన్య ఈ విషయంపై…
టాలీవుడ్ సీనియర్ హీరోలందరూ వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. చిరు ఏకంగా 3 సినిమాలను లైన్లో పెట్టగా.. వెంకటేష్ రెండు.. బాలకృష్ణ రెండు సినిమాలతో బిజీగా మారిపోయాడు. ఆ లెక్కన చూసుకుంటే కింగ్ నాగార్జున కొద్దిగా వెనకపడినట్లు కనిపిస్తుంది. పండగ సమయంలోను నాగ్ నుంచి ఎటువంటి అప్ డేట్ రాకపోయేసరికి అభిమానులు కొద్దిగా నిరాశపడ్డారు. అయితే నేను కూడా తగ్గేదేలే అంటూ బంగార్రాజు తో ఏంటి ఇచ్చేశాడు కింగ్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం నాగార్జున, రమ్య కృష్ణ…
అక్కినేని నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ సినిమాకి ప్రిక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. కల్యాణ్‌కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నాడు. నాగార్జున సరసన నాయికగా రమ్యకృష్ణ కనిపించనున్నారు. ఇక నాగచైతన్య పాత్ర కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. చైతు పాత్రకి జోడీగా కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మూడో వారం నుంచి చిత్రీకరణ షురూ చేయనున్నట్టు సమాచారం. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేస్తున్నారు. గ్రామీణ…
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘లవ్ స్టోరి’. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, ఎమిగోస్ క్రియేషన్స్ ప్రె.లి. నిర్మిస్తున్నాయి. ఈ సినిమా నుంచి విడుదల అయిన పోస్టర్లు, టీజర్, పాటలు అన్ని ఆకట్టుకోగా రికార్డ్స్ కూడా సృష్టిస్తున్నాయి. ఇక తెలంగాణ జానపదంను గుర్తుచేస్తూ వచ్చిన ‘సారంగ దరియా’ పాట…
అక్కినేని నాగ చైతన్య – డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ కలయికలో తెరకెక్కుతున్న చిత్రం ‘థాంక్యూ’. రాశీ ఖన్నా, మాళవికా నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అవికా గోర్ కీలక పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. వైజాగ్ షెడ్యూల్ తర్వాత ఇటలీలో జరపవలసిన షూటింగ్ ను కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా రద్దు చేసుకున్నారని ఆ మధ్య వినిపించింది. అయితే ‘థ్యాంక్యూ’ యూనిట్ మాత్రం ధైర్యంగా ఇటలీలో ల్యాండ్ అయింది.…