ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన సినిమా టిక్కెట్ ధరలపై ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలనే బలమైన భావన టాలీవుడ్ ప్రముఖుల్లో ఉంది. అయితే ఈ విషయంపై నాగార్జున స్పందించిన తీరుపై విమర్శలు వచ్చాయి. సినిమా టికెట్ రేట్లతో తనకేం సమస్య లేదని నాగార్జున చెప్పడం ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాలను షాక్ కు గురి చేసింది. తాజాగా నాగ చైతన్య ఈ విషయంపై స్పందించారు. నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన తాజా చిత్రం “బంగార్రాజు” జనవరి 14న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను చురుగ్గా ప్రమోట్ చేస్తున్న నాగ చైతన్యను ఆంధ్రప్రదేశ్ పరిస్థితి గురించి వ్యాఖ్యానించమని అడగ్గా… దానికి ఆయన తండ్రిబాటలోనే సమాధానం ఇచ్చారు.
Read Also : వైరల్ పిక్ : జడేజా ఫ్లవర్ అనుకుంటివా ఫైరూ !
“నేను నటుడిని. నా ప్రాజెక్ట్‌ల ఆదాయ అంశాల గురించి నేను పెద్దగా బాధపడటం లేదు. టిక్కెట్ ధరల సమస్య గురించి మీరు నా నిర్మాతలను అడగాలి. వారికి దానితో సమస్య లేకపోతే నాకు కూడా లేదు. ఏప్రిల్‌లో జిఓ తిరిగి వచ్చింది. ఆగస్ట్‌లో చిత్రీకరణ ప్రారంభించాం. జీఓ ఆధారంగా బడ్జెట్‌ను సవరించాం. ప్రభుత్వం ధరల పెంపుకు అనుమతిస్తే, అది మాకు సహాయం చేస్తుంది. కాకపోతే ఇప్పుడు అమలులో ఉన్న దానితో మేము సంతృప్తి చెందుతున్నాము” అని చైతన్య చెప్పుకొచ్చాడు. కాగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా హాళ్లలో 100% సీటింగ్ కెపాసిటీని అనుమతించింది. “బంగార్రాజు” కోసమే అన్నట్టుగా నైట్ కర్ఫ్యూ నిబంధనలను కూడా ప్రభుత్వం సడలించింది.