గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు. కూలీలతో వెళ్తున్న ఆటోను బుడంపాడు సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గరు వ్యవసాయ కూలీలు మృతి చెందడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ పనుల కోసం వెళ్తున్న మహిళలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విచారకరమన్నారు. మృతులు అరుణకుమారి, నాంచారమ్మ, సీతారావమ్మ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుంటామని సీఎం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రైతు కూలీలతో వెళుతున్న…
Nadendla Manohar: పేదల ఇళ్ల స్థలాల పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద ల్యాండ్ స్కాం.. తెనాలిలో జరిగిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కొంత మంది పేదల భూముల పేరుతో.. రైతులకు తక్కువ డబ్బు ఇచ్చి ప్రభుత్వం దగ్గర ఎక్కువ మొత్తాన్ని దోచేశారు అని చెప్పుకొచ్చారు.
జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వం చేయించుకొని ప్రమాదవశాత్తు మృతి చెందిన క్రియాశీలక మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు బకాయి పెట్టి వెళ్ళిపోయిన ప్రభుత్వం ఒక్క వైసీపీ మాత్రమేనని ఆరోపించారు.
గుంటూరు జిల్లా తెనాలిలోని జనసేన కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించారు.. జనసేన పార్టీ కార్యాలయంలో భోగి మంటలను వెలిగించారు మంత్రి నాదెండ్ల మనోహర్.. భోగి వేడుకల్లో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ప్రతి ఇంట్లో పండుగ వాతావరణం ఆనందంతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాం.. గత నాలుగైదు సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న రైతాంగానికి కూటమి ప్రభుత్వం అండగా నిలబడిందన్నారు..
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో సంక్రాంతి సంబరాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోగిమంటలను వెలిగించారు. అనంతరం.. భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.
కేంద్రం మన్మోహన్ సింగ్‌ను భారత రత్నతో గౌరవించాలి.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కేంద్ర ప్రభుత్వం భారత రత్నతో గౌరవించాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టింది మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. ఏక మొత్తంలో రైతుల రుణాలు మాఫీ చేసింది ఆయనేనని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదలకు ఉపాధి కలుగుతుంది అంటే అది.. పారదర్శకతకి సమాచార హక్కు తెచ్చిన ఘనత మన్మోహన్ సింగ్‌కి దక్కుతుందన్నారు. తెలంగాణ…
Nadendla Manohar : తూర్పుగోదావరి జిల్లా రాజానగరం రాయల్ కన్వెన్షన్ హల్‌లో జరిగే జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని ఇటీవల మరణించిన బాధిత కుటుంబసభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నాదెండ్ల మనోహర్ రాజానగరం చేరుకున్నారు. ముందుగా మధురపూడి ఎయిర్‌పోర్ట్ చేరుకుని.. అక్కడి నుండి రాజానగరం చేరుకున్నారు. జనసేన పార్టీ క్రియాశీలక…
Nadendla Manohar: క్రీడలను ప్రోత్సహించే ప్రయత్నాల్లో భాగంగా తెనాలిలో విశాలమైన క్రీడా స్టేడియంను నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ 1.76 ఎకరాల మునిసిపల్ భూమిని ఉపయోగించుకుంటుంది , ₹ 3 కోట్లు అంచనా వేయబడింది. ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో స్విమ్మింగ్ పూల్‌తో పాటు వాలీబాల్ , బాస్కెట్‌బాల్ కోర్టులు వంటి సౌకర్యాలు ఉంటాయి. Copper IUD: లైంగిక జీవితంపై కాపర్ టీ ప్రభావం ఎంతవరకు ఉంటుందో తెలుసా?…
ఈరోజు వరకు రూ.1050 కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేశామని.. గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రెండింతలు కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఆకస్మికంగా పర్యటించారు.
వచ్చే పదేళ్లలో మహిళలకు రూ.లక్ష కోట్ల మేర వడ్డీ లేని రుణాలిస్తాం హనుమకొండలో ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. వరంగల్ ఒక్క పట్టణానికి 6 వేల కోట్ల పనులను మంజూరు చేసి అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వం ఇది అని, వరంగల్ పట్టణాన్ని మహా నగరాన్ని చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తున్నామన్నారు. మహిళ వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనే ఆలోచనలో అన్ని ఆ నాటి ఇందిరమ్మ ప్రభుత్వం లో తెచ్చినవే.. అలాంటి…