గుంటూరు జిల్లా కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో జిల్లా సమీక్ష కమిటీ (డీఆర్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశంలో అధికార యంత్రాంగంతో చర్చించామన్నారు. రాబోయే రోజుల్లో గుంటూరు జిల్లాను అభివృద్ధి బాటలో నిలబెడతామని తెలిపారు. అమరావతి రాజధానిగా అభివృద్ధి చేయడంతో పాటు జిల్లాలో అభివృద్ధి, సంక్షేమం కలిపి ముందుకు తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. మరోవైపు.. ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో జిల్లాలో ఏడు లక్షల మంది లబ్ధి పొందుతారు.. ఉచిత గ్యాస్ పథకం సమాచారాన్ని ఆయా కంపెనీలు లబ్ధి దారులకు సమాచారం ఇస్తారని అన్నారు. నవంబర్ 1 నుండి మార్చి 31 వరకు ఉచిత సిలిండర్ ఉపయోగించుకోవచ్చని మంత్రి అన్నారు.
Read Also: Chiranjeevi: ANR జాతీయ అవార్డు అందుకున్న చిరంజీవి
మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పని చేయాలని అన్నారు. జిల్లా అభివృద్ధి కోసం పని చేయాలని తెలిపారు. వ్యవసాయం, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం, సబ్సిడీ పై ఆహార పదార్థాలు అందించడం అంశాల పై చర్చించామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు.. అమరావతిని, గుంటూరు జిల్లాను ఏక కాలంలో సాధిస్తామని అన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణ కోసం ప్రభుత్వం నిధులు సేకరిస్తుంది.. స్వదేశీ దర్శన్ పథకంలో భాగంగా బీచ్‌ల అభివృద్ధి చేయబోతున్నామని మంత్రి చెప్పారు. నవంబర్ 9 నుండి సీ ప్లేన్ అందుబాటులో ఉంటుంది..
ప్రకాశం బ్యారేజ్ నుండి శ్రీశైలంకు సీ ప్లేన్ పెట్టబోతున్నామని అన్నారు. సూర్యలంక, కాకినాడ, ఋషికొండ బీచ్‌లు అభివృద్ధి చేయబోతున్నామని పేర్కొ్న్నారు. ఋషికొండ రాజ భవంతిలో ప్రస్తుతం పర్యాటకులను అనుమతించడం లేదు.. కానీ భవిష్యత్‌లో సామాన్య ప్రజలను ఆ భవంతిలోకి అనుమతించేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Read Also: Nagarjuna: చిరంజీవి డాన్స్ చూసి నాకు గుబులు పుట్టింది!