కేంద్రం తరహాలోనే ఏపీ కూడా పెట్రో ఉత్పత్తులపై తన వాటా వ్యాట్ ను తగ్గించుకోవాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహార్ అన్నారు. పెట్రో రేట్లు తగ్గింపుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, కనీసం ఏపీ ప్రభుత్వం అలాంటి ఆలోచన చేస్తుందా లేదా అన్నారు. కేంద్రం బాటలోనే ఇప్పటికే చాలా రాష్ట్రాలు తమ వాటా పన్నులను తగ్గిస్తు ప్రజలపై భారాన్ని తగ్గిస్తున్నాయిన్నారు. అస్సాం, త్రిపుర, కర్ణాటక, మణిపూర్, గుజరాత్, గోవా రాష్ట్రాలు రూ.7 వంతున, ఒడిశా రూ.3 చొప్పున తగ్గించాయని మనోహార్ పేర్కొన్నారు.
ఏ మేరకు రాష్ట్రం వాటా పన్ను తగ్గిస్తారో ప్రభుత్వం ప్రజలకు తెలియ జేయాలన్నారు. ఇప్పటికే వ్యాట్ తోపాటు అదనపు పన్ను, సెస్సుల ను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోందని, రోడ్స సెస్ పేరుతో ఇప్పటి కే వందల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేసిందని దీంతో ఏం ప్రయోజనమో చెప్పాలన్నారు. కిలో మీటరు రోడ్డును కూడా అభి వృద్ధి కాదు కదా మరమ్మతు కూడా చేయలేకపోయారని ప్రభు త్వాన్ని మనోహార్ విమర్శించారు. ఈ స్థాయి పన్నులు, సెస్సులు చెల్లించినా ప్రజలకు ఏ భారం తప్పడం లేదని ఆయన అభిప్రా యపడ్డారు. కేంద్రం బాటలో… ఇతర రాష్ట్రాల మాదిరిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పెట్రోలు, డీజిల్ మీద వ్యాట్‌ను తగ్గించాలని ఆయన కోరారు. లేని పక్షంలో వైసీపీ ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి బలంగా తీసుకు వెళ్తామని నాదెండ్ల మనోహార్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.