పవన్ కల్యాణ్ రాజమండ్రి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.. అయితే, ఎన్ని ఆటంకాలు కల్పించినా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతాం అని ప్రశ్నించారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. జనసేన కార్యక్రమానికే కోవిడ్ రూల్సా..? సీఎం జగనుకు కోవిడ్ రూల్స్ వర్తించవా..? అని మండిపడ్డారు.. సీఎం జగన్ ఈ రోజు విజయవాడ బెంజి సర్కిల్‌లో నిర్వహించే కార్యక్రమానికి కోవిడ్ రూల్స్ ఎందుకు వర్తింపచేయడం లేదని నిలదీసిన ఆయన.. విజయవాడను దిగ్బంధించి మరీ వేల మందితో చెత్త వాహనాల కార్యక్రమం చేస్తే కోవిడ్ రాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రభుత్వ చేతగానితనం వల్ల రోడ్లు దెబ్బ తింటే జనసేన మరమ్మతులు చేస్తోందన్న నాదెండ్ల మనోహర్.. శ్రమదానం చేస్తామని ఎవరూ చెప్పలేదు.. అనుమతుల్లేవని పోలీసులతో ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తోందని ఆరోపించారు.. శ్రమదానంలో పాల్గొనవద్దంటూ జనసేన శ్రేణులను గృహ నిర్బంధాలు చేస్తున్నారని మండిపడ్డారు.. మరోవైపు.. జనసేన అధినేత పవన్ పిలుపుమేరకు రోడ్ కం రైల్వే బ్రిడ్జి వద్ద జనసైనికులు వెళ్లకుండా భారీగా మోహరించారు పోలీసులు.. తూర్పుగోదావరి జిల్లాకు ముఖద్వారం అయినటువంటి కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ మరియు జాతీయ రహదారి గ్రామం బ్రిడ్జి వద్ద జనసైనికులు అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా పెద్ద సంఖ్యలో మోహరించారు.