Janasena Party: ఏపీలో బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలపై ఆంక్షలు విధించడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ బహిరంగ లేఖను విడుదల చేశారు. సీఎం హోదాలో జగన్ బెంజ్ సర్కిల్‌లో కార్యక్రమాలు చేయలేదా అని విమర్శించారు. బెంజి సర్కిల్లో అన్ని మార్గాలు మూసేసి చెత్త వాహనాలకు, రేషన్ వాహనాలకు జగనే స్వయంగా జెండాలు ఊపలేదా అని నిలదీశారు. అప్పుడు ప్రజలకు కలిగిన…
ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు అప్పుడే హీట్ పెంచుతున్నాయి.. అధికార, విపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలతో మాటల యుద్ధమే నడుస్తోంది.. మరోవైపు.. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అన్ని పార్టీలు.. తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.. అయితే, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ కీలక నేత, బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటకి వెళ్లారు జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.. దీంతో, ఏపీ…
Nadendla Manohar: చిత్తూరు జిల్లా పుంగనూరులో పారిశ్రామిక వేత్త రామచంద్ర యాదవ్ ఇంటిపై దాడి చేయడాన్ని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తాం.. ఎదురించి నిలబడితే ఆస్తులను ధ్వంసం చేస్తాం.. మాన, ప్రాణాలను తోడేస్తామన్న రీతిలో ఆదివారం రాత్రి పుంగనూరు నియోజకవర్గంలో వైసీపీ నేతలు ప్రవర్తించారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన…
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారు.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ కృషి చెయ్యాలి.. మా పార్టీ నినాదం అదే అన్నారు జనసేనా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.. విజయనగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మిగతా రాజకీయ పార్టీలతో కలిసి వెళ్లాలా లేదన్నది సమయం వచ్చినప్పుడు స్పందిస్తాం అన్నారు.. రాష్ట్రంలో చాలా సమస్యలు తాండవిస్తున్నాయి…. ప్రతి చోటా మాకు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. జగనన్న కాలనీలు అవినీతిమయం..…
Nadendla Manohar: విశాఖ పర్యటనలో సీఎం జగన్‌పై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి విమర్శలు చేశారు. ప్రజలు వైసీపీపై తిరగబడటానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జనసేనకు కాండక్ట్ సర్టిఫికెట్ ముఖ్యమంత్రి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అన్యాయాలను ప్రశ్నిస్తున్నందుకు తమ పార్టీని రౌడీసేన అంటున్నారని.. ముఖ్యమంత్రి స్థాయి తగ్గించుకుని వ్యాఖ్యలు చేస్తున్నారని నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. సీఎం జగన్‌లో రెండు ముఖాలు ఉన్నాయని.. బయటకు కనిపించేది ఒక్కటైతే.. తెరవెనుక మరొకటి ఉందని ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని…
Nadendla Manohar: ఏపీ సీఎం జగన్‌పై జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన పార్టీని రౌడీసేననగా సంభోదిస్తూ జగన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. జనసేన ఎందుకు రౌడీసేన సీఎం జగన్ గారూ అంటూ ఆయన పలు ప్రశ్నలు సంధించారు. సీఎం జగన్ సొంత జిల్లాలో వరద బాధితులను గాలికొదిలేసిన వాస్తవాన్ని ప్రపంచానికి చూపినందుకా అని నిలదీశారు. ఆడబిడ్డలకు రక్షణ లేదని గొంతెత్తినందుకా అని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం రోడ్డున…
నవంబర్ 12, 13, 14 తేదీల్లో జనసేన ఆధ్వర్యంలో పక్కాగా సోషల్ ఆడిట్ నిర్వహిస్తామన్నారు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్.. దీని ద్వారా కొత్త తరహాలో సమస్యలు వెలికితీస్తామని వెల్లడించారు.