టీ తాగి వస్తానని ఇంట్లో చెప్పి బయటకి వెళ్లిన నదీమ్ తాహెర్ ఎంతకి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే కాల్ తియ్యలేదు. దీనితో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యలు పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తారీకున సంగారెడ్డి జిల్లా లక్డారం గేటు సమీపంలో జాతీయ రహదారి పక్కన ఓ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు.