మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమా షూటింగ్ కోసం మైసూర్‌లో ఉన్న సంగతి తెలిసిందే. నిన్న తన అమ్మమ్మ అల్లు కనక రత్నం మరణించడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన, మళ్లీ మైసూర్ షూటింగ్ కోసం బయలుదేరి వెళ్లారు. ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాకి సంబంధించి ఒక సాంగ్ షూట్ మైసూర్‌లోని ఒక ప్రాంతంలో జరుగుతోంది. అయితే, తాజాగా రామ్ చరణ్ తేజ్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. స్వతహాగా…
Karnataka: కర్ణాటక రాష్ట్రాన్ని ఇప్పుడు ‘‘గుండెపోటు’’ భయం కలవరపెడుతోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పలువురు ఆకస్మిక గుండెపోటు కారణాలతో మరణించారు. దీంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు. దీంతో, గుండె సంబంధిత పరీక్షల కోసం ప్రజలు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. మైసూరులోని ప్రముఖ ఆస్పత్రి అయిన జయదేవా ఆసుపత్రికి గుండెపోటు పరీక్షల కోసం వేలాది మంది తరలివస్తున్నారు.
Mysuru Suicide: కర్ణాటక రాష్ట్రం మైసూరు తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కూతురి ప్రేమ కుటుంబాన్నే బలి తీసుకుంది. అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయిందని కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లిదండ్రులతో పాటు చిన్న కూతురు హెబ్బల్హా జలాశయంలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కర్ణాటక పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ఇద్దరు అంధ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనుబరిచారు. మైసూరుకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎస్ఎస్ఎల్‌సీ పరీక్షల్లో భారీగా మార్కులు సాధించారు.
USA: భారతీయ టెక్కీ, ఎంటర్‌ప్రెన్యూర్ అమెరికాలోని వాషింగ్టన్‌లో తన భార్య, కొడుకును కాల్చి చంపి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఏప్రిల్ 24న జరిగింది. మరో కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. రోబోటిక్స్‌లో నిపుణుడు అయిన హర్షవర్ధన కిక్కెరీ హోలో వరల్డ్‌కి సహ వ్యవస్థాపకుడు. ఈ కంపెనీ 2022లో మూతపడింది.
ED Raids On Muda office: కర్ణాటకలో సంచలనం రేపుతున్న మూడా స్కాం కేసులో 12 మంది సభ్యులతో కూడిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం ఈరోజు (శుక్రవారం) మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ కార్యాలయంపై సోదాలు చేస్తుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై మైసూరు లోకాయుక్త ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మైసూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ప్లాట్ల కేటాయింపులో కుంభకోణానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
దక్షిణ భారత దేశంలో మరో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది. కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌లో ఈ స్టేడియం ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది.