Delhi: దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు మైనర్లు కలిసి ఓ వ్యక్తిని కత్తులతో పొడిచి చంపినట్లు ఆదివారం పోలీసులు తెలిపారు. ఆ తర్వాత శవాన్ని ఎండు గడ్డితో కాల్చినట్లు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తి ముగ్గురు టీనేజ్ నిందితులలో ఒకరిపై మృతుడు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతీకారంగానే నిందితులు ముగ్గురు, అతడినిపై ప్రతీకారం తీర్చుకునేందుకు హత్య చేశారు.
హైదరాబాద్ కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ కుమార్ (35) అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వ్యక్తిని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు నిందితుడు గోపి. హత్య చేసిన అనంతరం ఓ డస్ట్ బిన్ లో మృతదేహాన్ని నిప్పు పెట్టి తగలబెట్టాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో పరిశీలించి నిందితుడిని గుర్తించారు. ఈ హత్య కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఆదివారం హత్యా ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కొడవలితో మరో వ్యక్తిని పలుమార్లు నరికి చంపాడు. ఈ ఘటనకు సంబంధించి అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డైంది. నిందితుడు మాత్రం ఏ మాత్రం భయం, బెరుకు లేకండా బాధితుడిపై దాడికి దిగాడు. కాగా.. కొడవలితో దాడి చేస్తున్నప్పుడు స్థానికులు ఆపకుండా, ఫోన్లలో ఈ దాడిని మొత్తం వీడియో తీశారు.
పశ్చిమ బెంగాల్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిని దారుణంగా హత్య చేశారు. జాయ్‌నగర్‌లోని తన ఇంటి వద్దే సైఫుద్దీన్ లస్కర్ ను కాల్చి చంపారు. దీంతో టీఎంసీ నాయకులు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశారు. అంతేకాకుండా.. కొన్ని ఇళ్లకు నిప్పు పెట్టారు.
సిద్ధిపేట జిల్లా గజ్వేల్ (మం) దాతారుపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలిని దుండుగులు దారుణంగా హత్య చేశారు. రాజవ్వ (80) అనే వృద్ధురాలి నోట్లో యాసిడ్ పోసి, గుడ్డలు కుక్కి హత్యకు పాల్పడ్డారు. అనంతరం రాజవ్వ ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, కాళ్ళ పట్టీలను ఎత్తుకెళ్లారు గుర్తుతెలియని వ్యక్తులు. ఈ ఘటన గురించి వివరాలు తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
Hyderabad: నిన్న ఉదయం హైదరాబాద్ లోని చంపాపేట్ లో జరిగిన స్వప్న అనే యువతీ హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ నేపధ్యంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అంటున్నారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే.. స్వప్న కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. మృతిచెందిన స్వప్న అనే యువతి గతంలోసతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా స్వప్నకు…
Mumbai Crime: భరిస్తున్నారు కదా అని బాధపెడితే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే విసిగిపోయిన మనసు మనిషి ఆలోచలను వికృతంగా మారుస్తుంది. ముంబయి లోని ఓ కుటుంబంలో జరిగిన వరుస హత్యలే ఇందుకు నిదర్శనం. వివరాలలోకి వెళ్తే.. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో శంకర్ కుంభరే, విజయ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమారుడు రోషన్ సంఘమిత్ర అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కాగా 5 నెలల క్రితం సంఘమిత్ర తండ్రి…
Chittoor crime news: మద్యం మనిషి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అందుకే మద్యం సేవించిన వ్యక్తి ఆ మద్యం మత్తులో తనని తాను మర్చిపోవడంతో పాటుగా మంచి, చెడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేక పోతాడు. ఆ మద్యం మైకంలో తను చేస్తుంది నేరం అని నేరం చేస్తే శిక్ష తప్పదనే ఆలోచన కూడా చెయ్యలేడు. అందుకే అన్ని అనర్ధాలకి మూలం మద్యపానం. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం మద్యం మత్తులో ఓ వ్యక్తి…
Crime news: రోజు రోజుకీ మనుషుల్లో మానవత్వం నశిస్తుంది. మానవ సంబంధాలు మరుగున పడుతున్నాయి. పైసా మే పరమాత్మ అన్నట్లు బ్రతుకుతున్నారు చాలామంది. ఆస్తికోసం సొంత వాళ్లని కూడా చూడకుండా.. రక్తసంబంధీకులను కడతెరుస్తున్నారు. గతంలో ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. అన్నను చంపిన తమ్ముడు, తమ్ముడుని చంపిన అన్న, ఆస్తి కోసం కన్న తల్లిదండ్రులను చంపిన పిల్లలు ఇలా ఎన్నో వార్తలు వెలుగు చూసాయి. తాజాగా అలాంటి సంఘటనే ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే..…
బీహార్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. నలంద పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్బైత్ గ్రామంలో ఓ యువకుడిని ఇంటి నుంచి తీసుకుని వెళ్లిన తన స్నేహితుడు అనంతరం కాల్చిచంపాడు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది. అయితే ఘటనా స్థలం నుంచి పారిపోతున్న ఇద్దరు స్నేహితులను పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. వారి నుంచి ఒక పిస్టల్, 14 లైవ్ కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. మృతుడు మహ్మద్ అల్మాజ్(18)గా గుర్తించారు.