Hyderabad: నిన్న ఉదయం హైదరాబాద్ లోని చంపాపేట్ లో జరిగిన స్వప్న అనే యువతీ హత్య కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. ఈ నేపధ్యంలో సంచలన నిజాలు వెలుగు చూశాయి. హత్యకు ప్రేమ వ్యవహారమే కారణం అంటున్నారు పోలీసులు. వివరాలలోకి వెళ్తే.. స్వప్న కేసును దర్యాప్తు చేసిన పోలీసు అధికారులు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోలీసు అధికారుల సమాచారం ప్రకారం.. మృతిచెందిన స్వప్న అనే యువతి గతంలోసతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా స్వప్నకు ప్రేమ్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే స్వప్న వివాహం జరిగిన తరువాత కూడా మాజీ ప్రియుడు అయినటువంటి సతీష్ తో కాంటాక్ట్ లోనే ఉన్నది. సతీష్ చంపాపేట్ లోని స్వన ఇంటికి తరుచూ వస్తూ పోతూ ఉండేవాడు.
Read also:Israel-Hamas War: మెట్రో సొరంగాల వెబ్‌లో హమాస్ తీవ్రవాదులు.. ఇజ్రాయిల్ కు సవాల్
ఈ నేపథ్యంలో స్వప్నకు తన భర్త అయినటువంటి ప్రేమ్ మధ్యన ఇటీవల గొడవలు జరిగి మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. కాగా నిన్న ఉదయం 11:30 గంటలకు చంపాపెట్ లోని స్వప్నఇంటికి తన మాజిప్రియుడు సతీష్ అతని స్నేహితునితో కలిసి వచ్చాడు. అనంతరం సతీష్ స్వప్న గొంతు కోసి హత్య చేసాడు. తరువాత ప్రేమ్ ను రెండవ అంతస్తు నుండి కిందకు నెట్టేసాడు. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి లోని ఐసియులో స్వప్న భర్త ప్రేమ్ కుమార్ కోమాలో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ వాంగ్మూలాన్ని తీసుకుంటే కేసును ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా అతను స్పృహలోకి ఎప్పుడు వస్తాడో తెలీదు. ఈ క్రమంలో స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు .