Harassment: బాలికపై వేధింపులు.. క్రషర్లో వేసి హత్యకు పాల్పడ్డ నిందితులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనపై వేధింపులకు పాల్పడుతున్నారని నిరసన తెలిపినందుకు ఓ బాలికను క్రషర్‌లో వేసి హత్యకు పాల్పడ్డారు నిందితులు. ప్రస్తుతం వారు పరారీలో ఉన్నారు. బాగ్‌పత్‌లో.. క్రషర్ యజమానితో సహా ముగ్గురు వ్యక్తులు షెడ్యూల్డ్ కులాల అమ్మాయిపై వేధింపులకు పాల్పడుతున్నారు. ఏంటని బాలిక నిరసన వ్యక్తం చేయగా.. ఆమెను క్రషర్‌లోని వేడి నిప్పులలోకి విసిరారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు. కాగా.. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితులపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. బాలిక పరిస్థితి విషమంగా ఉందని, ఆమె ఢిల్లీలోని జిటిబి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
Read Also: New Year 2024: న్యూఇయర్‌లోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్, కిరిబాటి.. ఏ దేశంలో ఎప్పుడంటే?
Also Read
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
- Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
వివరాల్లోకి వెళ్తే.. బాధితురాలు తన కుటుంబంతో సహా ధనౌరా సిల్వర్ గ్రామంలో ఉన్న ప్రమోద్ క్రషర్‌లో కూలీగా పనిచేస్తోంది. బాధితురాలి సోదరుడు బినౌలీ పోలీస్ స్టేషన్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. తన సోదరి క్రషర్‌లో పనిచేస్తోందని చెప్పాడు. క్రషర్ యజమాని ప్రమోద్, రాజు, సందీప్ తన సోదరితో అసభ్యంగా ప్రవర్తించారు. తన సోదరి టీజింగ్‌కు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయడంతో.. నిందితులు కుల సంబంధిత పదాలను ఉపయోగించారు. అంతేకాకుండా.. ఆమెను చంపాలనే ఉద్దేశ్యంతో క్రషర్‌లోకి విసిరారని చెప్పాడు. దీని కారణంగా ఆమె తీవ్రంగా కాలిపోయింది. ఆ తర్వాత ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులకు చెప్పాడు.
ఇదిలా ఉంటే.. బాలిక పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆమెను వేధించి నిరసన తెలిపినందుకు క్రషర్‌లోని నిప్పుల్లో పడేసినందుకు నిందితులపై కేసు నమోదు చేశారు. వారిపై 354, 504, 307, షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగల కింద కేసు నమోదు చేశారు.
తాజావార్తలు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
-
Jinping: బ్రిక్స్ సదస్సుకు వస్తున్న జిన్‌పింగ్.. సోషల్ మీడియాలో చైనా పోస్ట్
-
Red Fort Blast: ఎర్రకోట ఉగ్రదాడి కేసు.. హిందూ ఆలయమే తొలి టార్గెట్..?
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?