టాలీవుడ్ లో మరోసారి పెళ్లిళ్ల సీజన్ స్టార్ట్ కానుంది. ఇప్పటికే అక్కినేని నాగా చైతన్య, శోభిత ధూళిపాళ ల నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఏడాది డిసెంబరు లో వీరి వివాహ వేడుక గ్రాండ్ గాజరగనున్నటు వార్తలు వస్తున్నాయి. ఇక తాజాగా మరొక యంగ్ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. అతడు మరెవరో కాదు ఆస్కార్ అవార్డు విన్నర్ MM కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ. మత్తువదలరా, తెల్లవారితే గురువారం, ఉస్తాద్ వంటి సినిమాల్లో నటించాడు శ్రీ…
Ashwini Dutt Crucial Comments on Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ విధించడంతో రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు నిరసనలు తెలియజేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ కక్షతోనే వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని విమర్శలు టీడీపీ సానుభూతిపరులు చేస్తున్నారు. ఇక తాజాగా చంద్రబాబు అరెస్ట్ పై సినీ పరిశ్రమకు చెందిన నటుడు-నిర్మాత మురళీమోహన్, నిర్మాత అశ్వనీదత్ స్పందించారు.…
(జూన్ 18న ‘ఓ మనిషీ! తిరిగిచూడు!!’కు 45 ఏళ్ళు) దర్శకరత్న దాసరి నారాయణరావు సామాన్యుల పక్షం నిలచి అనేక చిత్రాలను తెరకెక్కించారు. అలా రూపొందించిన ప్రతి సినిమాలోనూ సగటు మనిషి సమస్యలు, వాటికి తగ్గ పరిష్కారాలూ చూపిస్తూ సాగారు. ‘వెట్టిచాకిరి’పై పోరాటం సాగించాలి అని నినదిస్తూ తరువాత ఎన్ని సినిమాలు రూపొందినా, వాటికి ప్రేరణగా నిలచిన చిత్రం దాసరి రూపొందించిన ‘ఓ మనిషీ తిరిగిచూడు!’. 1977 జూన్ 18న ‘ఓ మనిషీ తిరిగిచూడు!’ చిత్రం జనం ముందు…
ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపి మురళీ మోహన్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుత తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్ అని ఎన్టీవీ ఛానెల్ కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాసరి నారాయణరావు జీవించి ఉన్నంత కాలం తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో చిరంజీవి కొంతవరకు భర్తీ చేస్తున్నారని అన్నారు. అలాగే చిత్ర…
(జూన్ 24న మురళీ మోహన్ పుట్టినరోజు)‘జగమే మాయ’ అంటూ చిత్రసీమలో ప్రవేశించిన మురళీ మోహన్ ఈ మాయా జగతిలోనూ అందరివాడు అనిపించుకున్నారు. కొందరు ఆయనను ‘అసలైన అందరివాడు’ అనీ అంటారు. నొప్పించక తానొవ్వక అన్నట్టుగా మురళీమోహన్ తీరు ఉంటుంది. అందరినీ నవ్వుతూ పలకరించడం, చిత్రసీమలో తనను ఆశ్రయించిన వారికి తగిన సాయం చేయడం, సినిమా రంగంలో ఏదైనా కార్యక్రమ నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించడం, ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’కు అధ్యక్షునిగా తనదైన బాణీ పలికించడం, ‘జయభేరీ’ అధినేతగా…
(జూన్ 4తో ‘జ్యోతి’ చిత్రానికి 45 ఏళ్ళు పూర్తి)కొన్ని సినిమాలు చూసినప్పటి కంటే తరువాత తలపుల్లో మెదలుతూ ఉంటాయి. మరికొన్ని మళ్ళీ చూసినప్పుడు ఆశ్చర్యాన్నీ కలిగిస్తాయి. ఈ రెండు కోవలకు చెందిన చిత్రం ‘జ్యోతి’. ఈ సినిమాలోని ఇతివృత్తం తలచుకుంటే అయ్యో అనిపిస్తుంది. అలా కాకుండా ఇలా జరిగి ఉంటే ఎంత బాగుండేది అనీ అనుకుంటాం. ‘జ్యోతి’ కథ అలా మనలను వెంటాడుతుంది. ఇక ఈ సినిమాను ఇప్పుడు చూస్తే ఎందుకు ఆశ్చర్యం వేస్తుంది అంటే ఈ…