Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్ ను ఒక ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య తో హిట్ అందుకున్న చిరు భోళా శంకర్ సినిమాతో పరాజయాన్ని చవిచూశాడు. విజయాపజయాలు చిరుకు కొత్తేమి కాదు. అందుకే ఇవేమి పట్టించుకోకుండా చిరు తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టేశాడు. ఇక చిరు ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే.