Chiranjeevi: మహేష్ ‘స్పైడర్’ డైరెక్టర్ తో చిరంజీవి.. అసలు నిజం ఇదే ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఈ ఏడాది ఒక హిట్ ను ఒక ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వాల్తేరు వీరయ్య తో హిట్ అందుకున్న చిరు భోళా శంకర్ సినిమాతో పరాజయాన్ని చవిచూశాడు. విజయాపజయాలు చిరుకు కొత్తేమి కాదు. అందుకే ఇవేమి పట్టించుకోకుండా చిరు తన తదుపరి సినిమాపై ఫోకస్ పెట్టేశాడు. ఇక చిరు ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను చిరు కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మిస్తోంది. ప్రస్తుతం చిరు మోకాలి సర్జరీ జరగడంతో కొంత గ్యాప్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ నేపధ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన రూమర్ ఒకటి తెరమీదకు వచ్చింది. అదేంటంటే.. కళ్యాణ్ కృష్ణ ప్లేస్ లోకి తమిళ్ దర్శకుడు మురగదాస్ వచ్చాడని. మురగదాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మహేష్ అభిమానులు మాత్రం ఆయనను అస్సలు మర్చిపోలేరు. స్పైడర్ లాంటి డిజాస్టర్ సినిమాను ఇచ్చిన డైరెక్టర్ మురగదాస్. మహేష్ కెరీర్ లోనే డిజాస్టర్ మూవీ అంటే అదే అని మహేష్ ఫ్యాన్స్ ఇప్పటికీ ఫైర్ అవుతారు.
Meera Jasmine: అందాలు ఆరబోసి.. ఎట్టకేలకు కుర్ర హీరో సినిమాలో ఛాన్స్ పట్టిందే.. ?
Also Read
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
- The Paradise Collections: యాహూ 'జడల్' 2 మిలియన్ కొట్టేశాడు.. కానీ ఇక కష్టమే!
- Violence Trend : వెండితెరకు రక్తాభిషేకం చేస్తే సినిమా హిట్ అవుతుందా
- Iran Embassy Shares Baahubali Video: ‘తలవంచం.. మోకరిల్లం’.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ మెసేజ్. ప్రభాస్ 'బాహుబలి' వీడియో షేర్ చేసి..!
ఇక ఇప్పుడు ఆ డైరెక్టర్.. చిరుతో సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కళ్యాణ్ కృష్ణ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని, ఆ ప్లేస్ లో మురగదాస్ ను తీసుకున్నారని వార్తలు వినిపించాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని సినిమాకు సంబంధించిన ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. ఇలాంటి రూమర్స్ ఎక్కడనుంచి పుట్టుకొచ్చాయి తెలియదు అని, కళ్యాణ్ కృష్ణతో పాటు కోర్ టీమ్ మొత్తానికి పెమెంట్స్ కూడా చేశారని సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం దస్పల్లాలో సిట్టింగ్స్ జరుగుతున్నాయని, ఒక వారంలో స్క్రిప్ట్ లాక్ కూడా చేస్తున్నామని అన్నారు. తమ కథ ఎఫ్ 2 సినిమా లాంటిది అని.. దానికి మురగదాస్ ను తీసుకోవడం ఏంటో అని నవ్వేశారు. ఇది కేవలం.. చిరు- కళ్యాణ్ కృష్ణ కాంబో ఇష్టం లేనివారు సృష్టించిన పుకారు అని చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయ్యేది ఎప్పుడు.. ? ఈ పుకార్లకు చెక్ పాడేది ఎప్పుడో చూడాలి.
తాజావార్తలు
-
Canara Bank Recruitment 2026-27: 3,500 పోస్టులు.. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండానే ఎంపిక?
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
-
Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
-
Trump Iran Statement: ‘త్వరలోనే విజయం సాధిస్తాం’.. ఇరాన్‌తో ఘర్షణపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!