గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై మంత్రులు సమీక్ష నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా మునుగోడుకు మంత్రులు జగదీశ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు మంత్రి కేటీఆర్ వెళ్లనున్నారు.
By-elections Results: దేశంలో నవంబర్ 3న జరిగిన ఉప ఎన్నికలకు నేడు ఓట్ల లెక్కింపు జరగనుంది. మొత్తం ఆరు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎవరు గెలుపు సాధిస్తారనేది నేడు తెలియనుంది. ఇందులో కొన్ని స్థానాలు బీజేపీకి చాలా కీలకంగా ఉన్నాయి. మహారాష్ట్రలోని అంధేరి ఈస్ట్, తెలంగాణలోని మునుగోడు, బీహార్ లోని మోకామా, గోపాల్ గంజ్, హర్యానాలోని ఆదంపూర్, ఒడిశాలోని ధామ్ నగర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోల గోకరనాథ్ నియోజకవర్గాలకు ఎన్నిలకు జరిగాయి.
నెలరోజుల పాటు తీవ్ర ఉత్కంఠను రేపిన మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరనేది రేపు ఆదివారం తేలిపోనుంది. మునుగోడు నియోజకవరగ్ంలో గురువారం జరిగిన జరిగిన పోలింగ్ లో మొత్తం 2లక్షల 41వేల 805 మందికి గానూ, 2లక్షల 25వేల 192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
కే.ఏ.పాల్ మునుగోడు ఉపఎన్నికల్లో తన విజయం ఖాయమని మరోసారి ధీమా వ్యక్తం చేశారు.1.05 లక్షల మంది యువత తనకే ఓటేశారని.. కనీసం 50వేల మెజార్టీతో గెలవడం పక్కా అని పోలింగ్ ముగిసిన తర్వాత తెలిపారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు పోలీసులు పటిష్ఠ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలు పహారా కాస్తున్నాయి.