* సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్లపై విచారణ
* ఇవాళ తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో సీఎం జగన్ పర్యటన.. ఉదయం 8 నుండి మధ్యాహ్నం 2 గం. వరకు ట్రాఫిక్ డైవర్షన్
* నంద్యాల జిల్లా అవుకులో దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథ్ రెడ్డి అంతిమ యాత్ర … చల్లా ఫామ్ హౌస్ లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
*కార్తీక ఏకాదశి సందర్భంగా మహానంది లో నేడు స్వామివారికి రుద్రాభిషేకం, కామేశ్వరి దేవి అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, కుంకుమార్చనలు సాయంత్రం పల్లకి సేవ
*కార్తీక శుద్ధ ఏకాదశి సందర్భంగా అన్నవరం సత్యదేవుని ఆలయం లో భక్తులు రద్దీ.. స్వామి వారి దర్శనం, వ్రతాలు కోసం సందడిగా మారిన ఆలయ ప్రాంగణం
*విశాఖలో నేడు జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం.. అజెండాలో పొందుపరిచిన 25 అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం
*అమరావతి హైకోర్టులో అయ్యన్నపాత్రుడు లంచ్ మోషన్ పిటిషన్ పై విచారణ… తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టెయ్యాలంటూ నిన్న హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు
*విజయవాడలో నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు ప్రారంభం
*కాకినాడలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పర్యటన… మరణించిన, గాయపడిన కార్యకర్తలు కుటుంబాలు కి ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ చేయనున్న మనోహర్
*నేడు రాజమండ్రిలో ది ఇన్నీసు పేట బ్యాంకు ఎన్నికల ఫలితాలు.. బ్యాంక్ ఎన్నికలలో ఓట్లు లెక్కించి హైకోర్టు ఆదేశాల మేరకు ఫలితాలు ప్రకటించకుండా భద్రపర్చిన అధికారులు
*నేడు తిరుపతిలో పర్యటించనున్న మంత్రి మేరుగ నాగార్జున