Munugode By Election Results: నెలరోజుల పాటు తీవ్ర ఉత్కంఠను రేపిన మునుగోడు ఉప ఎన్నికలో విజేత ఎవరనేది రేపు ఆదివారం తేలిపోనుంది. మరో 24 గంటల్లో మునుగోడు ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అయితే.. దీనికోసం అధికారులు నల్గొండలోని ఆర్జాలబావి సమీపంలోని ఎఫ్‌సీఐ గోదాంలో కౌంటింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ఫలితాల తీరుపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. రేపు ఉదయం 7గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. మునుగోడు నియోజకవరగ్ంలో గురువారం జరిగిన జరిగిన పోలింగ్ లో మొత్తం 2లక్షల 41వేల 805 మందికి గానూ, 2లక్షల 25వేల 192 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ అయిన అనంతరం ఈవీఎంలను నల్గొండ పట్టణంలోని ఆర్జాలబావి వద్ద ఉన్న వేర్ హౌసింగ్ గోడౌన్స్ లో స్ట్రాంగ్ రూంను ఏర్పాటు చేశారు.
Read also: Janvi kapoor: కొత్త ఇళ్లు కొన్న శ్రీదేవి కూతురు.. ఎన్ని కోట్లో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
298 పోలింగ్‌కేంద్రాల్లో పోలైన ఓట్ల లెక్కింపు కోసం నల్గొండ పట్టణంలోని అర్జాలబావిలో ఉన్న వేర్ హౌసింగ్ గోడౌన్స్‌లో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 21 టేబుల్స్ పై15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఒక్కో రౌండ్ లో 21 పోలింగ్ కేంద్రాల ఓట్లు లెక్కిస్తారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్‌ను ఓపెన్ చేసి, పోలైన 686 పోస్టల్ బ్యాలట్ ఓట్లను కౌంట్చేస్తారు. తర్వాత ఈవీఎంలను లెక్కిస్తారు. మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు..చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1గంట వరకు ప్రకటిస్తారు. మొదటగా చౌటుప్పల్, తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్ మండలాల ఓట్లు లెక్కిస్తారు.
Read also: Bharat Jodo Yatra: నేడు చౌటకూరు నుంచి భారత్ జోడో యాత్ర.. రేపు కామారెడ్డి జిల్లాలోకి ఎంట్రీ
ఇక, కౌంటింగ్ లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు. జిల్లా ఎన్నికల అధికారి వినయ్ కృష్ణా రెడ్డి, ఆర్ఓ రోహిత్ సింగ్, కేంద్రం నుంచి వచ్చిన ముగ్గురు పరిశీలకుల పర్యవేక్షణలో ఈ కౌటింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈనేపథ్యంలో.. ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్ సూపర్వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు.ఈ సందర్భంగా.. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు…స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం సీఆర్పీఎఫ్ బలగాలు పహారా కాస్తున్నాయి. అంతేకాకుండా.. సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇక,కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది ఏజెంట్లను నియమించారు.
China Spy Ship: భారత్‌పై నిఘా కోసం చైనా గూఢచారి నౌక .. క్షిపణి ప్రయోగానికి ముందు ఘటన