Heavy security for Munugode: ఇవాళ మునుగోడులో ఉప ఎన్నిక పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ బూత్‌కు చేరుకున్నవారికి కూడా ఓటింగ్‌కు అవకాశం కల్పించనున్నారు అధికారులు.. మునుగోడు నియోజకవర్గం పరిధిలో మొత్తం 2 లక్షల 41 వేల 855 మంది ఓటర్లు ఉన్నారు.. అందులో 50 మంది సర్వీస్ ఓటర్లు, 5,685 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నాయి. ఉప ఎన్నిక కోసం నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Read also: By-elections: మునుగోడుతో పాటు దేశంలో ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. బీజేపీకి కీలకం
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠరేపుతున్న మునుగోడు ఉపఎన్నికకు పోలీసులు పటిష్ఠ భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. మునుగోడు నియోజకవర్గవ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర బలగాలు పహారా కాస్తున్నాయి. దీంతో.. 35 ప్రాంతాల్లో పోలీసు ఉన్నతాధికారులు అదనపు భద్రత కల్పించనున్నట్లు వెల్లడించారు. ఇక, 2 వేల మంది సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నారు…మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపుర్ మండలాలు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి. రాష్ట్ర పోలీసులు, కేంద్ర బలగాలతో బందోబస్తు ఉంటుందని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. హింసాత్మక ఘటనలకు అవకాశమున్న కేంద్రాలను గుర్తించి… ప్రత్యేకంగా బలగాలను ఏర్పాటు చేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు చెక్‌పోస్టుల్లో తనిఖీలు నిరాటంకంగా కొనసాగిస్తామన్నారు. గత ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిని బైండోవర్ చేశామన్న పోలీసు ఉన్నతాధికారులు. మునుగోడు ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో.. పోలింగ్ శాతం కూడా భారీగానే పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Satya Dev Full Bottle : చేతిలో గ్లాసు.. వెనుక మందుబాటిల్.. సత్యదేవ్ వెరైటీలుక్.. ఫన్ గ్యారెంటీ