తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి బీజేపీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అక్కడ పోటీచేసి ఓటమి పాలయిన సంగతి తెలిసిందే. మునుగోడు ఉప ఎన్నికల్లో ప్రచారంలో చౌటుప్పల్ మున్సిపాలిటీలో పలు సమస్యలు తాను గుర్తించానని మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యత తనదే అన్నారు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. మునిసిపాలిటీని ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత వార్డ్ కమిటీ సభ్యులపై కూడా ఉంటుందన్నారు. అందరు చర్చించుకొని త్వరలో సమస్యలు పరిష్కారం దిశగా ముందుకె వెళదామన్నారు.
Read Also: Ram Charan: వాలెంటైన్స్ డేకి మెగా పవర్ స్టార్ సినిమా రిలీజ్ అవుతుందా?
చౌటుప్పల్ మున్సిపాలిటీని ధీటుగా అభివృధి చేస్తానని చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో పట్టణ ప్రగతి లో భాగంగా పురపాలక అభివృద్ధి గురించి వార్డు కమిటీల సమావేశం కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు. ఆయనతోపాటు చైర్మన్,మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, వార్డ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీని అందరితో కలిసి ముందుకు తీసుకువెళతానన్నారు.
ముఖ్యంగా సమస్యలు గుర్తించి చౌటుప్పల్ పెద్ద చెరువు తూము, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, అలాగే జీఎంఆర్ సంస్థతో మాట్లాడి సర్వీస్ రోడ్ల నిర్మాణం కూడా చేపడతామన్నారు. చౌటుప్పల్ మున్సిపాలిటీని అన్ని మున్సిపాలిటీలకు ధీటుగా అభివృద్ధి చెందుతుందన్నారు. మునుగోడులో కూడా ఉన్న పలు సమస్యలపై ఈ సంవత్సర కాలంలో తాను నిధులు తెచ్చి అభివృధి చేస్తానని దీనికి పార్టీలకు అతీతంగా సహకరించాలని తెలిపారు మునుగోడు ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.
Read Also: Ex Minister Nani Counter to Pawan Kalyan live: పవన్ కళ్యాణ్ కి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్