Ram-Puri Jagannadh’s Double iSmart First Schedule Shoot Completed: ఉస్తాద్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ క్రేజీ ఇండియన్ ప్రాజెక్ట్ డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్పై ఛార్మీ కౌర్ నిర్మిస్తున్న ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. రామ్ పోతినేని, సంచలన దర్శకుడు పూరీ జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ సినిమా షూట్ ఈ మధ్యనే మొదలైంది. ఇక తాజాగా ఈ సినిమా యాక్షన్-ప్యాక్డ్ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ను ముంబైలో విజయవంతంగా పూర్తి చేసుకుందని అధికారికంగా ప్రకటించారు. ఇక టీమ్ త్వరలో మరో క్రేజీ షెడ్యూల్ షూట్ ను ప్రారంభించనుందని తెలుస్తోంది. రామ్ తో పాటు పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కూడా తొలి షెడ్యూల్ షూటింగ్ లో పాల్గొన్నారని అంటున్నారు. ఇక ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన బిగ్ బుల్ ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇదే విషయాన్ని వెల్లడిస్తూ “మా ఫస్ట్ యాక్షన్-ప్యాక్ షెడ్యూల్ విజయవంతంగా పూర్తయింది, ఇప్పుడు మరో క్రేజీ షూట్ కోసం భారతదేశం నుండి బయలుదేరడానికి సమయం ఆసన్నమైంది. #డబుల్‌ఇస్మార్ట్ థియేటర్స్ లో మార్చి 8, 2024💥” అని నిర్మాత ఛార్మీ ట్వీట్ చేశారు, రామ్ తో పాటు ఆమె సెల్ఫీని కూడా షేర్ చేశారు.
Bhagavanth Kesari: బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీలపై సాంగ్ షూట్.. రచ్చ రచ్చే అంటున్నారే!
రామ్, పూరీల డెడ్లీ కాంబినేషన్ లో బ్లాక్‌బస్టర్ అయిన ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ అయిన డబుల్ ఇస్మార్ట్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్- ఛార్మి కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి విషు రెడ్డి సీఈవో. పూరి జగన్నాధ్ పెద్ద స్పాన్ ఉన్న ఈ కథను రాసుకుని కీలక నటీనటులను పూర్తిగా స్టైలిష్ గా చూపించనున్నారని, రామ్ కూడా బెస్ట్ లుక్ లో కనిపిస్తున్నారని అంటున్నారు. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కోసం హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ జియాని గియాన్నెల్లి పని చేస్తుండగా భారీ బడ్జెట్ తో ఈ డబుల్ ఇస్మార్ట్ రూపొందుతోంది. ఈ సినిమాకి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెబుతున్నారు మేకర్స్. డబుల్ ఇస్మార్ట్ సినిమా మార్చి 8, 2024న మహా శివరాత్రికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇక ఈ సినిమాలో రామ్ పోతినేని, సంజయ్ దత్ లు నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు కానీ హీరోయిన్లు కానీ ఇతర నటీనటుల వివరాలు కానీ వెల్లడించలేదు.
Successfully completed our 1st action-packed schedule and now time to fly out of India for our yet another maaddd crazy shoot 😀#DoubleISMART
IN CINEMAS MARCH 8th, 2024💥Ustaad @ramsayz #PuriJagannadh@duttsanjay @IamVishuReddy @PuriConnects pic.twitter.com/CVlAff4TiK
— Charmme Kaur (@Charmmeofficial) July 31, 2023