రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : విరాట్ కోహ్లీ, గ్లెన్ మాక్స్ వెల్, సిరాజ్ ను రిటైన్ చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు… 15 కోట్లతో కోహ్లీ, 11 కోట్లతో మాక్స్ వెల్, 7 కోట్లతో సిరాజ్ ను తీసుకున్న బెంగళూరు.. ఇంకా 57 కోట్లతో వేలానికి రానున్న ఆర్సీబీ ముంబై ఇండియన్స్ : రోహిత్ శర్మ. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ ను రిటైన్ చేసుకున్న ముంబై ఇండియన్స్… 16 కోట్లతో రోహిత్, 12 కోట్లతో…
ఐపీఎల్‌లో ముంబై జట్టుకు కీలక ఆటగాళ్లలో ఆల్‌రౌండర్ హార్డిక్ పాండ్యా ఒకడు. అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో హార్డిక్ పాండ్యా పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. పైగా పలు ఫిట్‌నెస్ సమస్యల కారణంగా అతడు బౌలింగ్ కూడా వేయలేదు. దీంతో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ విజయావకాశాలు దెబ్బతిన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఐపీఎల్‌కు ముంబై జట్టులో హార్డిక్ పాండ్యా చోటుకు అవకాశాలు సన్నగిల్లాయి. Read Also: గుడ్ న్యూస్ చెప్పిన క్రికెటర్…
IPLలో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. హైదరాబాద్‌పై గెలిచినా… మెరుగైన రన్ రేట్ లేకపోవడంతో… రోహిత్ సేనకు ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయాయి. ప్లే ఆఫ్ చేరాలంటే హైదరాబాద్‌పై 171 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండటంతో… టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై… ధాటిగా ఆడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే… సన్‌రైజర్స్‌ను చితగ్గొట్టింది. 20 ఓవర్లలో ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి……
ఐపీఎల్ 2021 లో ఈరోజు ఒక్కే సమయంలో రేంజు మ్యాచ్ లు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లలో ఒక్కటి సన్ రైజర్స్ హైదరాబాద్ – ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగనుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టును ఒకవేళ ముంబై జట్టు 171 పరుగుల తేడాతో ఓడిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్స్ కు వెళ్తుంది.…
ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవిన్ లూయిస్(24) నిలిచాడు. ఇక మిగతా వారందరూ చేతులెత్తేయడంతో రాజస్థాన్ జట్టు తక్కువ పరుగులకే తమ ఇన్నింగ్స్ ను ముగించింది. ఇక…
ఐపీఎల్ 20 21 ఈరోజు రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై జట్టు బ్యాటింగ్ బౌలింగ్ ఎంచుకొని రాజస్థాన్ జట్టును మొదట బ్యాటింగ్ కు పంపిస్తుంది. ఇక ఈ రెండు జట్లకు ప్లేఆఫ్స్ కు వెళ్లడం కోసం ఈ మ్యాచ్ చాలా కీలకం. కాబట్టి ఈ మ్యాచ్ లో ఎలాగైనా విజయం సాధించాలని ఈ రెండు జట్లు అనుకుంటున్నాయి. దానికి తగ్గట్లుగానే ఈ మ్యాచ్…
ఐపీఎల్ లో ఈరోజు కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో షార్జా వేదికగా ముంబై ఇండియన్స్ జట్టు రాజస్తాన్ రాయల్స్ జట్టును ఎదుర్కోనుంది. ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే… రెండు టీమ్స్ కి ఇది కీలక మ్యాచ్. ఇందులో ఎవరు ఓడిపోయినా వారు ఇంటికే. ఇక ప్రస్తుతం 10 పాయింట్స్ తో 6వ స్థానంలో రాజస్తాన్, 7వ స్థానంలో ముంబై జట్టు ఉంది. అయితే ఇప్పటివరకు ఐపీఎల్ లో 23 సార్లు హెడ్ టు హెడ్ ముంబై, రాజస్తాన్…
ఐపీఎల్ 2021 లో ఈరోజు మొదటి మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఓడి మొదట బయటింగ్ కు వచ్చిన ముంబై జట్టు ఢిల్లీ బలమైన బౌలింగ్ ముందు నిలవలేదు. వచ్చిన వారు వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. సూర్య కుమార్ యాదవ్ ఒక్కడే 33 పరుగులు చేయడంతో ముంబై జట్టు నిర్ణిత ఓవర్లలో 129 పరుగులు చేసి 8 వికెట్లు కోల్పోయింది. ఇక ఆ…
ఐపీఎల్ 2021 లో ఈరోజు ముంబై ఇండియన్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. అందులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన ముంబై జట్టుకు ఢిల్లీ బౌలర్లు షాక్ ఇచ్చారు. మొదట ఓపెనర్లను తక్కువ స్కోర్ కే కట్టడి చేసిన తర్వాత వచ్చిన బ్యాట్స్‌మెన్స్ ను వచ్చినట్లు పెవిలియన్ కు పంపించారు. ఎవరిని క్రీజులో కుదురుకోనివ్వలేదు. ముంబై జట్టులో సూర్య కుమార్ యాదవ్ చేసిన 33 పరుగులే అత్యధిక స్కోర్. అయితే వరుస…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గాయంతో ఐపీఎల్ 2021లో మిగతా మ్యాచ్‌లకు దూరమయ్యాడు. గత డిసెంబర్లో జరిగిన వేలంలో అర్జున్ టెండూల్కర్‌ను ముంబై ఇండియన్స్ కనీస ధర 20 లక్షలకు సొంతం చేసుకుంది. అయితే అర్జున్ ముంబై తరపున ఒక్క మ్యాచ్లో కూడా బరిలోకి దిగలేదు. అలా ఐపీఎల్ ఆడకుండానే గాయం కారణంగా అర్జున్ తప్పుకోవాల్సి వచ్చింది. ప్రస్తుతం యూఏఈ నుండి అర్జున్ ఇండియాకి వస్తున్నాడు. ఇక అర్జున్ టెండూల్కర్ స్థానంలో రైట్…