ఐపీఎల్ 2021 లో ఈరోజు రాజస్థాన్ రాయల్స్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 90 పరుగులు మాత్రమే చేసింది. ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఎవిన్ లూయిస్(24) నిలిచాడు. ఇక మిగతా వారందరూ చేతులెత్తేయడంతో రాజస్థాన్ జట్టు తక్కువ పరుగులకే తమ ఇన్నింగ్స్ ను ముగించింది. ఇక ముంబై బౌలర్లలో నాథన్ కౌల్టర్-నైల్ నాలుగు వికెట్లు, జేమ్స్ నీషమ్ మూడు వికెట్లు తీయగా బూమ్రా రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో విజయం సాధించాలంటే ముంబై ఇండియన్స్ 91 పరుగులు చేస్తే చాలు. ఒకవేళ ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్ రేసులో ముందుకు వెళుతుంది. అలాగే ఒదిన రజస్త జట్టు ఇంటికి వెళుతుంది. చుడాలిమరి ఏం జరుగుతుంది అనేది.