ఐపీఎల్ 2021 : ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు గల్లంతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPLలో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది. హైదరాబాద్‌పై గెలిచినా… మెరుగైన రన్ రేట్ లేకపోవడంతో… రోహిత్ సేనకు ప్లే ఆఫ్ దారులు మూసుకుపోయాయి. ప్లే ఆఫ్ చేరాలంటే హైదరాబాద్‌పై 171 పరుగుల తేడాతో గెలవాల్సి ఉండటంతో… టాస్ గెలవగానే బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై… ధాటిగా ఆడింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే… సన్‌రైజర్స్‌ను చితగ్గొట్టింది. 20 ఓవర్లలో ఏకంగా 235 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగి… కేవలం 16 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతని బాదుడుకు ముంబై స్కోరు 7.2 ఓవర్లలోనే వంద దాటింది.
ఫిఫ్టీ తర్వాత కూడా దూకుడు కొనసాగించిన ఇషాన్… 32 బంతుల్లోనే 84 పరుగులు చేసి ఔటయ్యాడు.ఇషాన్‌కు తోడు సూర్యకుమార్ యాదవ్ కూడా రెచ్చిపోయి ఆడాడు. కేవలం 40 బంతుల్లోనే 82 రన్స్ చేసి ఔటయ్యాడు. ఇషాన్, సూర్యకుమార్ రేంజ్‌లో ముంబై మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోయారు. రోహిత్ 18, పొలార్డ్ 13, పాండ్యా 10 పరుగులే తీశారు. చివరి వరుస బ్యాట్స్‌మెన్ కూడా తక్కువ స్కోరుకే పరిమితమయ్యారు. దాంతో 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది… ముంబై. 236 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన హైదరాబాద్‌కు… ఓపెనర్లు శుభారంభం అందించారు.
Also Read
- SRHకి నటరాజన్ రీఎంట్రీ.. రూ.10.75 కోట్ల నుంచి రూ.5 కోట్లకు తగ్గి మరీ..!
- Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
- CSK కొత్త హెడ్ కోచ్‌గా మాజీ టీమిండియా పేసర్.. IPL 2027కు కీలక మార్పు
- MS Dhoni CSK Stake: సీఎస్కేలో 25 శాతం వాటా డిమాండ్ చేసిన ధోనీ..! మౌనం వీడిన ఫ్రాంచైజీ.. తెరపైకి అసలు విషయం
తొలివికెట్‌కు 5.2 ఓవర్లలో 64 రన్స్ జోడించారు. జేసన్ రాయ్ 34 రన్స్ చేయగా, అభిషేక్ శర్మ 33 రన్స్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ మనీష్ పాండే ధాటిగా ఆడటంతో… హైదరాబాద్ స్కోర్ బోర్డు ఉరకలు వేసింది. మనీష్ 41 బంతుల్లోనే 69 రన్స్ చేశాడు. మనీష్ ఔటయ్యాక ప్రియం గార్గ్ మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఎవరూ పెద్దగా స్కోరు చేయలేకపోవడంతో… 20 ఓవర్లలో 8 వికెట్లకు 193 పరుగులే చేయగలిగింది… హైదరాబాద్. ముంబై 42 పరుగుల తేడాతో గెలిచినా… భారీ వ్యత్యాసంతో నెగ్గకపోవడంతో… ప్లే ఆఫ్ దశకు చేరకుండానే IPL నుంచి నిష్క్రమించింది. 32 బంతుల్లోనే 84 రన్స్ చేసిన ఇషాన్ కిషన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ దక్కింది.
తాజావార్తలు
-
Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
-
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల ఎన్నికలు నిలిపివేయాలని హైకోర్టులో పిల్!
-
Sugar Stock Limits: చక్కెర నిల్వలపై కేంద్రం కొత్త నిబంధనలు.. నేటి నుంచే అమలు..
ట్రెండింగ్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..