ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ముంబయికి బ్యాటింగ్ అప్పగించింది. బ్యాటింగ్‌కి దిగిన రోహిత్ సేన 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది.
సీఎస్కే మ్యాచ్ కు ముందు అర్జున్ నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను ట్విట్టర్ లో ముంబై ఫ్రాంఛైజీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో అర్జున్ ఐపీఎల్ లోకి ఎంట్రీ ఖాయమని ముంబై అభిమానులు ఫిక్స్ అయిపోయారు.
MI ట్విట్టర్‌లో షేర్ చేసిన వీడియోలో, ధోనీ, ఇషాన్ కిషన్ IPL యొక్క 'ఎల్ క్లాసికో'కి ముందు చాట్ చేస్తూ కనిపించారు. అదే వీడియోలో 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్ కూడా వాంఖడే స్టేడియంను సందర్శించారు. MI కెప్టెన్ రోహిత్ శర్మతో సహా ఆటగాళ్లతో సచిన్ టెండూల్కర్ సంభాషించాడు.
IPL చరిత్రలో అతిపెద్ద మ్యాచ్ గురించి చర్చించేటప్పుడు ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జాబితాలో అగ్రస్థానంలో ఉంటుంది. ఈ రెండు జట్లు ఒకదానితో ఒకటి పోటీపడినప్పుడల్లా పోటీ ఉత్కంఠభరితంగా ఉంటుంది.
ఐసీసీ టోర్నీల్లో ఆండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో.. అంతే క్రేజ్ ఐపీఎల్ లో చెన్నై ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు ఉంటుంది. టీఆర్ఎపీలు బద్దలు కావాల్సిందే.. ముంబై వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం అన్ని ఫ్రాంఛైజీల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తారు.
ఈ ఏడాది సీజన్ కు దూరమైన రిచర్డ్ స్థానంలో మరో ఆసీస్ పేసర్ రిలే మెరెడిత్ ను ముంబై ఇండియన్స్ భర్తీ చేసింది. కనీస ధర రూ. 1.5 కోట్ల మెరెడిత్ తో ముంబై టీమ్ ఒప్పందం కుదుర్చుకుంది.