ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో ముంబై ఇండియన్స్ దారుణ ప్రదర్శన కొనసాగుతుంది. ఈ ఏడాది మెగా టోర్నీలో వరుసగా రెండో ఓటమిని ముంబై చవిచూసింది. శనివారం వాంఖడే స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ జట్టు పరాజయం పాలైంది. ఈ మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ముంబై విఫలమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబైకు ఓపెనర్లు రోహిత్ శర్మ ( 21), ఇషాన్ కిషన్ ( 32) అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ తోకు వీరిద్దరూ 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం కిషన్ తన దూకుడైన ఆటను కొనసాగించి పవర్ ప్లే ముగిసేసరికి తమ స్కోర్ బోర్డును 60 పరుగులు దాటించాడు. అయితే ఇషాన్ కిషన్ ఔట్ అయిన అనంతరం ముంబై పతనం మొదలైంది. వరుస క్రమంలో ముంబై ఇండియన్స్ వికెట్లు కోల్పోయింది.
Also Read : Surya-Dhoni : సూర్యకుమార్ చెవిలో మహీ మంత్రం
ఆఖరిలో టీమ్ డేవిడ్ ( 31) పరుగులతో రాణిచడం వల్ల ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు సాధించింది. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.1 ఓవర్లలో టార్గె్ట్ ను ఛేధించింది. సీఎస్కే బ్యాటర్లలో అజింకా రహానే ( 27 బంతుల్లో 61: 7 ఫోర్లు, 3 సిక్సులు ) సంచలన ఇన్సింగ్స్ ఆడాడు. అతడితో పాటు రుత్ రాజ్ గైక్వాడ్( 40) పరుగులతో రాణించాడు. అయితే సీఎస్కే చేతిలో ఘోర ఓటమిని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగానే రోహిత్ తన క్యాప్ తో ముఖం దాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ముంబై తమ తదుపరి మ్యాచ్ ను ఏప్రిల్ 11న ఢిల్లీ క్యాపిటల్స్ తో తలపడనుంది.
Also Read : Haldwani jail: హల్ద్వానీ జైలులో హెచ్ఐవీ కలకలం.. మహిళతో సహా 44 మంది ఖైదీలకు పాజిటివ్..