IPL 2023 : వాళ్లు మమ్మల్ని భయపెట్టారు.. అందుకే ఓడిపోయాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు ఈ సారి తీవ్ర నిరాశ పరుస్తుంది. ఈ మెగా టోర్నమెంట్ లో భాగంగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ముంబై ఓడిపోయింది. వరుసగా రెండు మ్యాచ్ ల్లో పరాజయం పాలైన ముంబై.. పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానంలో నిలిచింది. ఇక చెన్న సూపర్ కింగ్స్ చేతిలో ఓటమిపై ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. సీఎస్కే స్పిన్నర్లు తమను కోలుకోలేని దెబ్బ కొట్టారని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్ లో భాగంగా రోహిత్ మాట్లాడుతూ.. మాకు అద్భుతమైన ఆరంభం లభించింది. అయితే మేము దానిని సద్వినియోగం చేసుకోలేదు. పిచ్ బ్యాటింగ్ కు చక్కగా అనుకూలించింది. అయితే మా ఇన్సింగ్స్ మిడిల్ ఓవర్లలో మేము వరుస క్రమంలో వికెట్లు కోల్పోయాం అని రోహిత్ శర్మ అన్నాడు.
Also Read : Hyderabad Traffic : నేడు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ దారుల్లో వెళ్తే అంతే సంగతి..
Also Read
- T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
- Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
- India Matches: 3 నెలలు, 28 మ్యాచ్‌లు.. టీమిండియా బిజీ షెడ్యూల్ మాములుగా లేదుగా..!
- Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ 'ఏ' జట్టులోకి ఎంట్రీ..
అయితే 30-40 పరుగులు తక్కువగా చేశాం.. అదే మా కొంపముంచింది. నిజం చెప్పాలంటే చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. వారు బాగా బౌలింగ్ చేసి మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అటువంటి బౌలర్లపై ఎదురుదాడికి దిగాలంటే చాలా ధైర్యం కావాలన్నాడు. కానీ మా జట్టులో చాలా మంది యువ ఆటగాళ్లు ఉన్నారు.. వారికి అంత అనుభవం లేదు.. వారు అద్భుతంగా రాణించాలంటే కొంత సమయం పడుతుంది. మా జట్టులో యంగ్ క్రికెటర్లకు చాలా ప్రతిభ ఉంది.. కాబట్టి మా జట్టు ఎల్లప్పడూ వారికి మద్దతుగా నిలుస్తుంది. అయితే కొంతమంది సీనియర్ ఆటగాళ్లు జట్టులో ఉంటే బాగుండేదనిపిస్తుంది. ఇక ఐపీఎల్ లో తొలి మ్యాచ్ లోవిజయం సాధించడం ఎంతో ముఖ్యమో నాకు బాగు తెలుసు అని రోహిత్ అన్నాడు. కానీ మా అదృష్టం బాగా లేదు కానుక మేము రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయాం.. అంతే కానీ మొత్తం టోర్నీ నుంచి వెళ్లిపోలేదు.. మేము తిరిగి మ్యాచ్ ల్లో గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచేందుకు ప్రయత్నం చేస్తామని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
Also Read : Eknath Shinde: నేడు మహా సీఎం అయోధ్య పర్యటన.. ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి రాముడి దర్శనం..

తాజావార్తలు
-
Haribabu Murder Case: యూట్యూబర్ వైష్ణవి భర్త హత్య కేసులో కీలక పరిణామం.. మరో నలుగురి పాత్రపై దర్యాప్తు..!
-
Family Movies Dominate 2026 Box Office : 2026లో బాక్సాఫీస్ వద్ద ‘ఫ్యామిలీ సినిమాల’ హవా.. కుటుంబ ప్రేక్షకులకు నచ్చితే కలెక్షన్ల వర్షమే!
-
T20I Rankings: ఆఫ్ఘనిస్తాన్ పై క్లీన్ స్వీప్ చేసినా.. నెం.1 ర్యాంక్ కోల్పోయిన టీమిండియా..!
-
Deepika Padukone: రూ.100 కోట్ల సినిమాలతో బాలీవుడ్ బ్యూటీ రికార్డ్.. కత్రినా, అలియా కంటే ముందున్న స్టార్ హీరోయిన్!
-
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్‌కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో సిల్వర్
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!