CSK vs MI: 5 వికెట్లను కోల్పోయిన ముంబయి.. 10 ఓవర్లలో స్కోరు ఇలా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CSK vs MI: CSK vs MI: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలోని చెన్నై జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ప్రత్యర్థి జట్టు ముంబయికి బ్యాటింగ్ అప్పగించింది. బ్యాటింగ్‌కి దిగిన రోహిత్ సేన 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 84 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ(21), ఇషాన్ కిషన్(32)లు జోరుగా మ్యాచ్‌ను ప్రారంభించినా ఎక్కువ సేపు నిలదొక్కుకోలేక పోయారు. తుషార్ దేశ్‌పాండే వేసిన నాలుగో ఓవర్‌లో రోహిత్ శర్మ(21) బౌల్డ్ అయ్యాడు. తొలి బంతిని స్టాండ్స్‌లోకి పంపిన అతను ఆఖరి బంతికి ఔటయ్యాడు. ధాటిగా ఆడుతున్న ముంబై ఓపెనర్ ఇషాన్ కిషన్(31)ను రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. ఇషాన్ గాల్లోకి లేపిన బంతిని బౌండరీ వద్ద ప్రిటోరియస్ అందుకున్నాడు. దాంతో, 64 వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది. అనంతరం వచ్చిన సూర్యకుమార్ యాదవ్(1) సాంట్నర్ బౌలింగ్‌లో వెంటనే ఔటయ్యి వెనుదిరిగాడు.

Also Read
- Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
- Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
- Christa Pike: మరణశిక్ష కోసం 2-సార్లు విషపు ఇంజెక్షన్లు.. అయినా, క్రిస్టా పైక్ ఎలా బతికింది.?
ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ స్పిన్నర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. జడేజా వేసిన 9వ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్(12) బంతిని పైకి లేపగా.. రిచర్న్ క్యాచ్ పట్టి ఔట్ చేశాడు. దాంతో, ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. సాంట్నర్ వేసిన 10వ ఓవర్‌లో అర్షద్ ఖాన్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దాంతో ముంబై ఐదు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. చెన్నై బౌలర్లు రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్‌లు తలో రెండు వికెట్లు తీయగా.. తుషార్ దేశ్ పాండే ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం క్రీజులో తిలక్ వర్మ(11), టిమ్ డేవిడ్(3) ఉన్నారు.
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!