ముంబయిలోని వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో ముంబయి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్కు దిగిన కోల్కతా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.
ఆడపిల్లలకు విద్య, క్రీడల్లో ప్రోత్సాహం కల్పిస్తూ వారికి క్రీడా రంగంలో కావాల్సిన మద్దతును అందివ్వడం ఈఎస్ఏ ప్రధాన ఉద్దేశం. ఈఎస్ఏ ఫౌండేషన్ డే ను పురస్కరించుకుని వారిలో స్పూర్తిని నింపేందుకు గాను ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ ఇవాళ ఈ జెర్సీతో బరిలోకి దిగనున్నారు.
రహానేకు వెళ్లి ఎంజాయ్ చేయమని చెప్పాను, ఒత్తిడి తీసుకోకండి మరియు మేము మీకు మద్దతు ఇస్తాము. అతను బాగా బ్యాటింగ్ చేసాడు మరియు అతను ఔట్ అయిన విధానంతో అతను సంతోషంగా లేడని ధోని తెలిపాడు. నేను ప్రతి గేమ్ ముఖ్యమని భావిస్తున్నాను, మీరు చూడండి మీ ముందున్న సమస్యలపై ఒక అడుగు వేయండి.. ప్రస్తుతానికి పాయింట్ల పట్టికను చూడకండి అని ధోని చెప్పుకొచ్చాడు.
చెన్నై సూపర్ కింగ్స్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు.. వారు బాగా బౌలింగ్ చేసి మమ్మల్ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టారని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అటువంటి బౌలర్లపై ఎదురుదాడికి దిగాలంటే చాలా ధైర్యం కావాలన్నాడు.
సీఎస్కే చేతిలో ఘోర ఓటమిని ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ జీర్ణించుకోలేకపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించగానే రోహిత్ తన క్యాప్ తో ముఖం దాచుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. 158 పరుగుల ఛేదనే లక్ష్యంగా బరిలోకి దిగిన ధోనీ సేన 10 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 97 పరుగులు చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16 సీజన్లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ దిగ్గజ టీంలు ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. బ్యాటింగ్ దిగిన రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది.