IPL 2023 : ముంబై వర్సెస్ సీఎస్కే… మ్యాచ్ కు బీభత్సమైన క్రేజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ టోర్నీల్లో ఆండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ కి ఎంత క్రేజ్ ఉంటుందో.. అంతే క్రేజ్ ఐపీఎల్ లో చెన్నై ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు ఉంటుంది. టీఆర్ఎపీలు బద్దలు కావాల్సిందే.. ముంబై వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోసం అన్ని ఫ్రాంఛైజీల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తారు. అందుకే ఈ ఫైట్ ని ఐపీఎల్ ఈఎల్ క్లాసిక్ అని కూడి పిలుస్తారు. అసలు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ లకి ఇంత క్రేజ్ రావాడినిక గల కారణాలు తెలుసా.. ఓ వైపు లక్నో సూపర్ జెయింట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ ఆడుతుంటే జనాలు అంతా సీఎస్కే, ముంబై మ్యాచ్ గురించే చర్చించుకోవడం ప్రారంభించారు. ఈ ఎల్ క్లాసిక్ గోల ఏంటి ఐపీఎల్ 2018లో చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ గురించి ఒక్క మాటలో చెప్పమని ఆడిగినప్పుడు ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ.. ముంబై మాజీ ఆల్ రౌండర్ కిరన్ పోలార్డ్.. ఎల్ క్లాసిక్ అంటూ చెప్పారు.
Also Read : Currency Notes: పాత రూ.500, 1000నోట్లపై వస్తున్న వార్తలు అవాస్తవం
Also Read
- Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
- Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
- iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..

ఫుట్ బాల్ లో బార్సిలోనా, రియాల్ మాడ్రిడ్ మధ్య మ్యాచ్ ని ఇలా ెల్ క్లాసికో అని పిలుస్తారు. క్రికెట్ లో అదీ ఐపీఎల్ లో అలాంటి నేమ్.. ముంబై-చెన్నై మ్యాచ్ లకు దక్కింది. ఐపీఎల్ లో ఐదుసార్లు కప్ కొట్టిన ముంబై.. ఆ తర్వాత స్థానం నాలుగు సార్లు టైటిల్స్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ దే. అనవసరంగా రెండేళ్లు బ్యాన్ పడింది. కానీ.. లేకుంటే ఇప్పటికే చెన్నై ఖాతాలో కూడా ఐదు టైటిల్స్ ఉండే వని సీఎస్కే ఫ్యాన్స్ అంటుంటారు. ధోని కెప్టెన్సీలో చెన్నై సూపర్ కిగ్స్ కి ఐపీఎల్ లో మిగిలిన అన్ని జట్లపై ఘనమైన రికార్డు ఉంది. అయితే ముంబై ఇండియన్స్ కి సీఎస్కే పై అదిరిపోయే రికార్డు ఉంది. ఐపీఎల్ లో మొత్తంగా ఈ రెండ్ టీమ్స్ మధ్య 34 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో గ్రూప్ మ్యాచ్ లు పోగా ప్లే ఆఫ్స్ లో 9 సార్లు, ఫైనల్స్ లో నాలుగు సార్లు ముంబై ఇండియన్స్.. చెన్నై సూపర్ కింగ్స్ తలపడ్డాయి.
Also Read : Pakistan Crisis: పాకిస్తాన్‌పై మరో పిడుగు.. 2026 కల్లా రూ.63 వేల కోట్లు కట్టకపోతే..
నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్.ముంబై ఇండియన్స్ మధ్య ఐపీఎల్ ఓపెనర్ మ్యాచ్ లు జరిగాయి. సీఎస్కే పై అత్యధికంగా 20 మ్యాచ్ ల్లో ముంబై ఇండియన్స్ జట్టు విజయాలు అందుకుంది. సీఎస్కే ముంబైపై కేవలం 13 మ్యాచ్ ల్లోనే విజయాలు దక్కాయి. 2010లో ఐపీఎల్ ఫైనల లో ముంబై ఇండియన్స్ ను ఓడించి.. టైటిల్ ను చెన్నై కైవసం చేసుకుంది. సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో తొలిసారి ఫైనల్ చేరిన ముంబై టైటిల్ సాధించలేకపోయింది. అయితే ఆ తర్వాత సీన్ పూర్తిగా మారిపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాక ఫైనల్ లో ముంబై ఇండియన్స్ ను ఒక్కసారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ ఓడించలేకపోయింది.
Also Read : Kidnap Drama : నీ మొగుడిని వదిలి నాతో రా.. లేదంటే..
ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ 2019 ఫైనల్ మ్యాచ్ అయితే ఎవ్వరూ మరిచిపోలేరు. ఒక్క పరుగు, ఒకే ఒక్క పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ టైటిల్ ను గెలుచుకుంది. ఆ తర్వాత ఐపీఎల్ 2020, 2021 సీజన్ లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కి ఫుల్ మజాని అందించాయి. ఐపీఎల్ 2022 సీజన్ లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ రెండూ కూడా అట్టర్ ప్లాన్ అయ్యాయి. చెరో 4 మ్యాచ్ ల్లో గెలిచి 10 పరజాయాలు నమోదు చేసుకున్నాయి. అలాంటి సీజన్ లోనూ ఈ రెండూ జట్ల మధ్య మ్యాచ్ లు క్రికెట్ ఫ్యాన్స్ కి పుల్లు మజాని అందించాయి. ఐపీఎల్ 2022లో మంబై, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్ లో ఆఖరి ఓవర్ ఆఖరి బంతికి విజయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. అయితే ఈ సారి ఇరు జట్లలో పై చేయి ఎవరిది అవుతుందోనని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!