Pregnant Woman: నిండు గర్భిణి.. పురుటినొప్పితో బాధపడుతోంది. ఆసుపత్రికి వెళ్లేందుకు రోడ్డు లేదు. అమె వైద్యం చేయించేకోవాలంటే ప్రవాహాన్ని దాటాలి. ఇటీవల కురిసిన వర్షాలకు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ పరిస్థితుల్లో ప్రవాహాన్ని దాటడం ప్రమాదకరం. ఈ స్థితిలో కుటుంబ సభ్యులు నరకం చూశారు. ఆస్పత్రికి ఎలా తీసుకెళ్లాలో తెలియక… మనోవేదనకు గురయ్యాడు. ఈతగాళ్లు… స్థానికుల సాయంతో… అతి కష్టం మీద వాగు దాటేందుకు ప్రయత్నించారు. గర్భిణిని టైరుపై కూర్చోబెట్టి మెల్లగా వాగు దాటారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకుంది.
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని మారుమూల గ్రామం. ఈ ఊరికి రవాణా సౌకర్యం సరిగా లేదు. ఎందుకంటే జంపన్న నది అడ్డంగా ఉంది. ఊరు దాటాలంటే జంపన్న వాగు దాటాలి. మామూలు రోజుల్లో పర్వాలేదు.. ఎలాగోలా గడిచిపోతుంటాయి. అయితే వర్షం కురిసినా.. వాగు పొంగిపొర్లినా.. ఇక ఆ గ్రామస్తులకు నరకం మొదలవుతుంది. వాగు పొంగిపొర్లితే… ఎలిశెట్టిపెల్లి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి. ఆ సమయంలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఊరు దాటే మార్గం లేదు. ప్రాణాలను పణంగా పెట్టి నదిని దాటాలి. గర్భిణులు, వృద్ధులు… ఆ సమయంలో నరకం చూస్తున్నారు. అత్యవసరంగా ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చినా ఇబ్బందులు పడుతున్నారు. పొంగిపొర్లుతున్న నదిని దాటలేక… వారి బాధలు అన్నీఇన్నీ కావు. ఇప్పుడు.. ఈ గర్భిణికి ఎదురైన కష్టాలు కూడా అలాగే ఉన్నాయి. ఆమె పేరు దబ్బగట్ల సునీత. ఆమెకు నెలలు నిండటంతో పురిటినొప్పులు మొదలయ్యాయి.
ఆస్పత్రికి తీసుకెళ్లాలంటే… రోడ్డు లేదు. జంపన్న నది పొంగిపొర్లుతోంది. ఏం చేయాలో తోచక… గజ ఈతగాళ్లు, స్థానికులు ఆమెకు సాయం చేశారు. వారు ఆమెను టైరుపై కూర్చోబెట్టి ప్రవాహాన్ని దాటారు. గర్భిణిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆ మహిళ ఆస్పత్రికి చేరే వరకు నరకం చూసింది. గర్భిణీ.. టైరుపై కూర్చొని వాగు దాటడం అంత సులువు కాదు. వాగు దాటుతున్నప్పుడు ఆమె పడే వేదన వర్ణనాతీతం. వంతెన కావాలని ఎలిశెట్టి పెల్లి గ్రామ ప్రజలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అత్యవసర సమయంలో గ్రామం దాటాలంటే… తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తమ గ్రామానికి వంతెన మంజూరు చేయాలని వేడుకుంటున్నారు. కానీ… ఇప్పటి వరకు పాలకులు స్పందించకపోవడంతో… వారి కష్టాలు అలాగే ఉన్నాయి. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి వంతెన మంజూరు చేయాలని ఎలిశెట్టి పెళ్లీడు గ్రామస్తులు కోరుతున్నారు.
Foods for Kids: పిల్లలకి జ్ఞాపకశక్తి పెరగాలంటే ఇవి తినిపించండి..!