ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ నెల 26 వరకు కుంభమేళా కొనసాగనున్నది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. తాజాగా వ్యాపార దిగ్గజం, అపర కుభేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో…