ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి గంగామాతకు ప్రత్యేక పూజలు చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ నెల 26 వరకు కుంభమేళా కొనసాగనున్నది. సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు మహా కుంభమేళాలో పాల్గొంటున్నారు. తాజాగా వ్యాపార దిగ్గజం, అపర కుభేరుడు ముకేశ్ అంబానీ కుటుంబం మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమంలో ముకేశ్ అంబానీ తన తల్లి, కుమారులు, మనుమలు/మనుమరాళ్లతో కలిసి పుణ్య స్నానం ఆచరించారు.
Also Read: New Income Tax Bill: గురువారం పార్లమెంట్ ముందుకు కొత్త “ఇన్‌కమ్ ట్యాక్స్ బిల్లు”..
ముకేశ్ అంబానీ తన తల్లి కోకిలాబెన్, కుమారులు ఆకాశ్, ఆనంత్, కోడళ్ళు శ్లోకా, రాధికా, మనుమలు పృథ్వి, వేద, అక్కలు దీప్తి సల్గావ్కర్, నీనా కోఠారి తదితరులతో కలిసి పతిత్ర స్నానం చేశారు. వీరితో పాటు ముకేశ్ అంబానీ అత్త పూర్ణిమాబెన్ దలాల్, మరదలు మమతాబెన్ దలాల్ కూడా పాల్గొన్నారు. నిరంజని అఖాడాకు చెందిన స్వామి కైలాషానంద గిరిజీ మహారాజ్ గంగా పూజను నిర్వహించారు. పూజ అనంతరం ముకేశ్ అంబానీ పరమార్థ్ నికేతన్ ఆశ్రమానికి చెందిన స్వామి చిదానంద సరస్వతీ మహారాజ్‌ను కలిశారు. ఆశ్రమంలో అంబానీ కుటుంబం ప్రసాదం, లైఫ్ జాకెట్లను పంపిణీ చేసింది.
Also Read:Surya Son of Krishnan: వాలెంటైన్స్ డే స్పెషల్.. మరోసారి తెరకెక్కనున్న “సూర్య సన్నాఫ్ కృష్ణన్”..
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, మహా కుంభమేళాలో యాత్రికుల సేవ కోసం ‘తీర్థ యాత్రి సేవ’ పేరిట వివిధ సేవలను అందిస్తోంది. ఈ యాత్రలో యాత్రికుల సంక్షేమం, సౌకర్యాలను మెరుగుపరచడానికి కంపెనీ ఈ ప్రత్యేక సేవలను చేపడుతోంది. ‘వీ కేర్’ తత్వాన్ని ఆధారంగా తీసుకుని రిలయన్స్ యాత్రికులకు పౌష్టికమైన భోజనం (అన్న సేవ), పూర్తి వైద్యం, భద్రతా రవాణా, మెరుగైన కనెక్టివిటీ వంటి అనేక సేవలను అందిస్తోంది. అంతేకాకుండా పవిత్ర నదీ జలాల్లో భద్రత, సౌకర్యవంతమైన విశ్రాంతి కేంద్రాలు, స్పష్టమైన మార్గదర్శక వ్యవస్థ, పరిపాలన, పోలీస్, మరియు లైఫ్ గార్డులకు మద్దతు వంటి ఇతర సేవలు కూడా అందిస్తోంది.