CSK సారథి MS ధోని, ప్రధాన కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌లను కలిసిన భారత మాజీ ఓపెనర్ క్రిస్ శ్రీకాంత్ స్వాగతించడం వీడియోలో ఉంది. ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచ్‌కు ముందు చెన్నై కెప్టెన్‌కి శ్రీకాంత్ దీవెనలు ఇవ్వడం కనిపిస్తుంది.
ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో నెలకొల్పబడిన ప్రతిష్టాత్మకమైన మేరిల్బోన్ క్రికెట్ క్లబ్ (MCC) ప్రపంచ కప్ విజేత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు మరో నలుగురు ప్రముఖ భారత అంతర్జాతీయ ఆటగాళ్లకు బుధవారంనాడు 'లైఫ్ మెంబర్షిప్' ఇచ్చింది.
ఐపీఎల్ 2023 సీజన్లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ సింగ్స్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్(57), ఓపెనర్ డేవాన్ కాన్వే(47) అద్భుతంగా రాణించారు. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో వచ్చిన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అదిరిపోయే సిక్సర్లు బాదడం విశేషం.
మహేంద్ర సింగ్ ధోని బ్యాక్ టూ బ్యాక్ సిక్సర్లుగా కొట్టాడు. అంతే ధోని అభిమానులను కరిగిపోయేలా చేసింది. ఆ రెండు సిక్సర్లతో ఎంజాయ్ చేశారని మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా అన్నారు.
ధోని.. తమ బౌలర్ల ఆట తీరుపై మాత్రం తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పరిస్థితి ఇలాగే ఉంటే కొత్త కెప్టెన్ సారథ్యంలో ఆడాల్సి వస్తుంద(తాను తప్పుకొంటానని)ని నవ్వుతూనే గట్టి వార్నింగ్ ఇచ్చాడు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత పెద్ద వయస్సు ఉన్న కెప్టెన్ గా ఎంఎస్ ధోని నిలిచాడు. ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సారథిగా బరిలోకి దిగిన ధోని ఈ అరుదైన రికార్డును సాధించాడు. ధోని 41సంవత్సరాల 267 రోజుల వయస్సులో ఈ ఘనత నమోదు చేశాడు.